Netflix Subscription: నెట్‌ఫ్లిక్స్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఇక తక్కువ ధరలకే సబ్‌స్క్రిప్షన్‌-netflix tied up with microsoft to introduce lesser price ad supported plans ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Subscription: నెట్‌ఫ్లిక్స్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఇక తక్కువ ధరలకే సబ్‌స్క్రిప్షన్‌

Netflix Subscription: నెట్‌ఫ్లిక్స్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఇక తక్కువ ధరలకే సబ్‌స్క్రిప్షన్‌

HT Telugu Desk HT Telugu
Jul 14, 2022 10:55 AM IST

Netflix Subscription: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో కంటెంట్‌కు కొదవ లేదు. క్వాలిటీ మూవీస్‌, వెబ్‌ సిరీస్‌ వస్తూనే ఉంటాయ్‌. అయితే ఆ స్థాయిలోనే సబ్‌స్క్రిప్షన్‌ రేట్లు ఎక్కువగా ఉండటంతో చాలా మంది దీనికి దూరంగా ఉంటున్నారు.

ఇక తక్కువ ధరకే నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌
ఇక తక్కువ ధరకే నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ (REUTERS)

ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ)ల్లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది నెట్‌ఫ్లిక్స్‌. హాలీవుడ్‌ స్థాయిలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌ రూపొందించే ఈ ఓటీటీ.. మిగతా వాటితో పోలిస్తే సబ్‌స్క్రిప్షన్ల కోసం భారీ మొత్తమే వసూలు చేస్తోంది. దీని కారణంగా ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్లు దూరమవుతుండగా.. కొత్తవాళ్లు అసలు దీని దగ్గరకే రావడం లేదు.

దీంతో ఇప్పుడు కాస్త తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్‌ అందించాలని నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పటికే నిర్ణయించింది. ఈ సబ్‌స్క్రైబర్లకు యాడ్స్‌తో కూడిన సబ్‌స్క్రిప్షన్‌ వస్తుందని గతంలో తెలిపింది. తాజాగా ఆ దిశగా మరో అడుగు వేసింది. ఈ యాడ్స్‌తో కూడిన సబ్‌స్క్రిప్షన్‌ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. ఈ సంస్థను తన గ్లోబల్‌ అడ్వర్‌టైజింగ్‌, సేల్స్‌ పార్ట్‌నర్‌గా ప్రకటించింది.

ఈ ఏడాది తొలి క్వార్టర్‌లోనే నెట్‌ఫ్లిక్స్‌ 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి నెట్‌ఫ్లిక్స్‌ ఈ యాడ్స్‌తో కూడిన సబ్‌స్క్రిప్షన్‌ ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఉన్న యాడ్స్‌ లేని బేసిక్‌, స్టాండర్డ్‌, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లతోపాటు కొత్తగా దీనిని తీసుకురానుంది. నెలకు రూ.199తో కేవలం మొబైల్‌ ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో గరిష్ఠ ఏడాది ప్లాన్‌ రూ.7700 వరకూ ఉంది. అదే నెట్‌ఫ్లిక్స్‌ ప్రధాన కాంపిటీటర్లయిన ప్రైమ్‌ వీడియో, డిస్నీ హాట్‌స్టార్‌ల గరిష్ఠ ప్లాన్‌ ఏడాదికి రూ.1500 మాత్రమే. దీంతో చాలా మంది కన్జూమర్లు నెట్‌ఫ్లిక్స్‌ వదిలేసి వాటివైపు వెళ్తున్నారు. ఈ వలసలను ఆపేందుకు ఈ ఏడాది చివర్లోపు నెట్‌ఫ్లిక్స్‌ యాడ్‌-సపోర్టెడ్‌ ప్లాన్స్‌ను తీసుకురానుంది. ప్రస్తు ప్లాన్స్‌తో పోలిస్తే ఇవి చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం