BSNL 797 Recharge Plan | ఈ ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా?-bsnl 797 recharge prepaid plan details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bsnl 797 Recharge Plan | ఈ ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

BSNL 797 Recharge Plan | ఈ ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Mar 21, 2022 01:40 PM IST

బీఎస్ఎన్ఎల్ కొత్తగా 797 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తెచ్చింది. ఈ ప్లాన్‌లో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 365 రోజుల పాటు వాలిడిటీ ఉంటుంది.

బీఎస్ఎన్ఎల్ 797 రీచార్జ్ ప్లాన్‌తో చౌకగా 365 రోజులపాటు వాలిడిటీ కలిగి ఉండవచ్చు.
బీఎస్ఎన్ఎల్ 797 రీచార్జ్ ప్లాన్‌తో చౌకగా 365 రోజులపాటు వాలిడిటీ కలిగి ఉండవచ్చు. (HT_PRINT)

బీఎస్ఎన్ఎల్ లాంఛ్ చేసిన రూ. 797 ప్లాన్ 365 రోజుల వాలిడిటీ కలిగి ఉంటుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2 జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా కలిగి ఉంటుంది. కొత్త ప్లాన్ పరిచయం చేస్తున్నందున ఆరంభంలో అదనంగా నెల రోజుల వాలిడిటీ అందిస్తోంది. అంటే మొత్తంగా 395 రోజుల పాటు వాలిటీ ఉంటుందన్న మాట. 

బీఎస్ఎన్ఎల్ 797 ప్రీపెయిడ్ ప్లాన్ ఇలా..

ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 2 జీబీ హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ ప్రయోజనాలు తొలి 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. 

ఆ తరువాత కొనుగోలుదారులు టాక్ టైమ్ కావాలన్నా, లేక డేటా ప్లాన్ కావాలన్నా వోచర్ ప్యాక్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోయినా సిమ్ వాలిడిటీ మాత్రం 365 రోజుల పాటు వర్తిస్తుంది. కేటాయించిన డేటా అయిపోయిన తరువాత డేటా వేగం 80 కేబీపీఎస్‌‌కు పడిపోతుంది. జూన్ 12లోపు రీఛార్జ్ చేయించుకున్న వారికి మాత్రమే నెల రోజుల అదనపు వాలిడిటీ ఉంటుంది.

రెండో సిమ్ కార్డు కలిగి ఉండాలనుకున్న వారికి, అలాగే అవుట్ గోయింగ్ అవసరం లేదనుకున్న వారికి ఇది బాగా పనికొస్తోంది. పైగా చౌకైన ప్లాన్ కూడా. 

 

 

 

IPL_Entry_Point