Relations | మీ నిద్ర స్థానాలను బట్టి మీ భాగస్వామితో బంధం ఎలాంటిదో చెప్పవచ్చు-your sleeping position can reveal your bonding with your partner ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Your Sleeping Position Can Reveal Your Bonding With Your Partner

Relations | మీ నిద్ర స్థానాలను బట్టి మీ భాగస్వామితో బంధం ఎలాంటిదో చెప్పవచ్చు

Manda Vikas HT Telugu
Feb 23, 2022 10:26 PM IST

జంటలు నిద్రించే భంగిమలను బట్టి వారి బంధం ఎలాంటిదో అంచనావేయవచ్చునని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. అది ప్రేమ కావొచ్చు, ద్వేషం కావొచ్చు లేదా ఆధిపత్యం కావచ్చు. ఒకే పడకపై నిద్రపోతున్నపుడు జంట బాడీ లాంగ్వేజ్ లను బట్టి ఇద్దరి మధ్య ఏమి జరుగుతుందో ఓ అంచనాకు రావొచ్చట.

Representational Image
Representational Image (Stock Photo)

మీరు మీ భాగస్వామి పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారా? పడకగదిలో మీరు తనని ఎంతగా ఇష్టపడుతున్నారో, వారు కూడా మిమ్మల్ని అంతే ఇదిగా ఇష్టపడుతున్నారా? ఇలాంటి రహస్యాలు ఎవరూ బయటకు బహిర్గతం చేయకపోవచ్చు కానీ, జంటలు నిద్రించే భంగిమలను బట్టి వారి బంధం ఎలాంటిదో అంచనావేయవచ్చునని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. అది ప్రేమ కావొచ్చు, ద్వేషం కావొచ్చు లేదా ఆధిపత్యం కావచ్చు. ఒకే పడకపై నిద్రపోతున్నపుడు జంట బాడీ లాంగ్వేజ్ లను బట్టి ఇద్దరి మధ్య ఏమి జరుగుతుందో తెలుస్తుంది. పడుకునేటపుడు ఎలా ఉన్నా, ఘాడమైన నిద్రలోకి జారుకున్నతర్వాత ఒక శారీరక స్థితికి విధమైన వస్తారు. దాని ప్రకారం ఇద్దరి మధ్య బంధం ఇలా ఉండొచ్చు అని చెబుతున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి.

ఇరువురి వీపు భాగాలు ఒకే వైపు ఉంటాయి, కానీ తగలవు

భాగస్వాములు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమిస్తున్నప్పటికీ, వారిలో కొంత అసహజత్వం ఉన్నట్లుగా అనిపిస్తుంది. వీరు బాధ్యతలకు ఎక్కువ విలువ ఇస్తారు. రొమాన్స్ కూడా ఒక బాధ్యతగా భావిస్తారు.

వెనకనుంచి హత్తుకొని చేతిలో చేయేసి పడుకోవడం

దీని అర్థం, భాగస్వాములు ఇద్దరూ ప్రేమను ఆస్వాదిస్తారు, ఇలా హత్తుకొని, చేత్తులు కలుపుకొని పడుకోవడంలో ఒకరికొకరు రక్షణగా భావిస్తారు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉందనే భావనను కలిగి ఉంటారు. వీరిలో శృంగారం కంటే కూడా ఒకరంటే ఒకరికి ప్రేమ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే వారి బంధాన్ని బలోపేతం చేస్తుంది.

రెండు వెన్నులు ఒకదానికొకటి తాకడం

ఇలాంటి స్లీపింగ్ పొజిషన్ కొత్తగా పెళ్లైన జంటల మధ్య లేదా కొత్తగా ఏర్పర్చుకున్న బంధాల మధ్య సాధారణం. వీరు ఆ శృంగార స్పర్శను కలిగి ఉంటారు, అలా ఇద్దరి మధ్య సహకారంతో ఒకరి మధ్య ఒకరికి బంధం బలపడాల్సి ఉంటుంది.

ఇద్దరు ఒకరిపై ఒకరు చేతులువేసుకొని దగ్గరగా పడుకోవడం

ఇది కూడా కొత్త జంటల మధ్య జరుగుతుంది. కొంత సమయం పాటు ఇలా ఒకరికొకరు దగ్గరగా పడుకొని ఆ తర్వాత వారి వారి సాధారణ నిద్ర స్థితిని బట్టి దూరంగా వెళ్లిపోతారు. ఇలాంటి వారి మధ్య ప్రేమ, నమ్మకం. సాన్నిహిత్యం నెమ్మదిగా ఏర్పడుతుంది, అందుకు సమయం పడుతుంది.

ఎవరికి నచ్చినట్లుగా వారు పడుకోవడం

ఇలాంటి స్లీపింగ్ పొజిషన్ భాగస్వాముల పట్ల ఆధిపత్య ధోరణిని చూపుతుంది. ఇది ఒక సంబంధంలో చెడు సంకేతమే. ఇలాంటి జంటల్లో ఒకరిపట్ల ఒకరికి ప్రేమానురాగాలు, విశ్వాసం ఉండవు. ఆధిపత్యం ప్రదర్శించే వ్యక్తి తన మంచం మీద మరొకరికి చోటు ఇవ్వడానికి ఇష్టపడడు. ఏదో అడ్జస్ట్ అవుతున్నట్లుగా ఇద్దరు ఒకే మంచంపై పడుకుంటారు.

మీ భాగస్వామి ఛాతిపై నిద్రపోవడం

కొత్త జంటలు లేదా మధ్యలో కొత్తగా ప్రేమ వికసించిన సందర్భంలో ఇలా భాగస్వామి ఛాతిపై నిద్రిస్తారు. ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు ఈ రకంగా భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తారు. అయితే ఇలా చాలా తక్కువ మంది చేస్తారని అధ్యయనాలు వెల్లడించాయి.

కొంచెం గ్యాప్ ఇచ్చి పడుకోవడం

ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటుంది, కానీ వారికి కొంత ఇగో కూడా ఉంటుంది. ఇలా గ్యాప్ ఇచ్చి పడుకోవడంలో అర్థం ఏంటంటే నేను కొంచెం దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నపుడు మరో అడుగు భాగస్వామి నుంచి పడాలి అని కోరుకుంటారు.

భాగస్వామిని ముందునుంచి గట్టిగా హత్తుకొని పడుకోవడం

ఇలా స్లీపింగ్ పొజిషన్ రొమాంటిక్ గానే అనిపిస్తుంది కానీ అందులో ఒక లొసుగు ఉంది. ఇది ఒక వ్యక్తి తన భాగస్వామికి స్వాతంత్య్రం ఇవ్వలేకపోవడాన్ని తెలుపుతుంది, అభద్రతాభావాన్ని సూచిస్తుంది. నిద్రపోయినపుడు కూడా తనను విడిచి వెళ్లకుండా ఒకరకంగా 'లాక్' చేయడం లాంటిది. కేవలం సెక్స్ మాత్రమే కోరుకుంటారు, దానినే ప్రేమగా భావిస్తారు.

అయితే ఇవి కొన్ని అధ్యయనాలు, పరిశీలనల ప్రకారం మనస్తతత్వవేత్తలు చెప్పినవి మాత్రమే తప్పితే, పడుకునే విధానాన్ని బట్టి ఒకరి మధ్య బంధం ఎలాంటిది అనేది కచ్చితంగా నిర్ణయించలేము. ఒక జంటకు ఒకరిపట్ల ఒకరంటే ఇష్టం, నమ్మకం, ప్రేమ ఉన్నప్పుడు ఎలాంటి గోడలు అడ్డురావు.

 

WhatsApp channel

సంబంధిత కథనం