బెస్ట్ ఫీచర్లు, స్టైలిష్ లుక్‌తో వచ్చిన బైక్ Yamaha MT-15 వెర్షన్ 2.0 విశేషాలు-yamaha mt 15 ver 2 0 bike price features other details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Yamaha Mt-15 Ver 2.0 Bike Price, Features Other Details Inside

బెస్ట్ ఫీచర్లు, స్టైలిష్ లుక్‌తో వచ్చిన బైక్ Yamaha MT-15 వెర్షన్ 2.0 విశేషాలు

HT Telugu Desk HT Telugu
Apr 18, 2022 12:00 PM IST

యమహా నుంచి 155 సిసి కలిగిన యమహా MT-15 వెర్షన్ 2.0 బైక్ ఇండియాలో రిలీజ్ అయింది. దీనిలోని ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

Yamaha MT-15 Ver 2.0
Yamaha MT-15 Ver 2.0

ద్విచక్ర వాహనాల తయారీదారు యమహా మోటార్ ఇండియా ఇటీవల 2022 Yamaha MT-15 వెర్షన్ 2.0ని విడుదల చేసింది. ఈ బైక్ గురించి మార్కెట్లో చాలా ఆసక్తి నెలకొని ఉంది. దీని విడుదలకు ముందే యమహా ఇండియా తన అధికారిక వెబ్ సైట్లో ఈ బైక్ కు సంబంధించిన యాక్సెసరీస్ ను పొందుపరిచింది. లోగో స్టిక్కర్ రూ. 80 నుంచి సుమారు రూ. 7 వేలు విలువ చేసే ఆకర్షణీయమైన పరికరాలను అమ్మకానికి ఉంచడంతో ఈ బైక్ పై ఆసక్తి పెరిగింది. ఎట్టకేలకు Yamaha MT-15 Ver 2.0ను భారత్ లోకి తీసుకొచ్చింది. ఇందులో తలక్రిందులుగా ఉన్న ఫ్రంట్ ఫోర్కులు, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సరికొత్త యమహా బైక్ లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధరలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Yamaha MT-15 Ver 2.0 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

డిజైన్ పరంగా ఈ బైక్ గతంలో ఉత్పత్తి నిలిపివేసిన మోడల్‌తో సమానంగా కనిపిస్తున్నప్పటికీ. ఇందులో ఎల్‌ఈడీ పొజిషన్ లైట్‌లు, హై-రైజ్డ్ ఎల్‌ఈడీ టెయిల్-లైట్, దృఢంగా కనిపించే బాడీవర్క్ కలిగి ఉంది.

ఎలక్ట్రానిక్స్ పరంగా MT-15 వెర్షన్ 2.0లో యానిమేటెడ్ టెక్స్ట్‌తో కూడిన పూర్తి డిజిటల్ LCD క్లస్టర్, అలాగే గేర్ షిఫ్ట్, గేర్ పొజిషన్, VVA సూచిక ఉన్నాయి. ఈ బైక్ ను యమహాకు చెందిన Y-కనెక్ట్ యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా కాల్‌లు, ఇ-మెయిల్‌లు, SMS అలర్ట్స్ పొందవచ్చు. పార్కింగ్ లొకేషన్, ఇంధన వినియోగం, లోపాలు తదితర సమాచారం కూడా అందిస్తుంది.

Yamaha MT-15 Ver 2.0లో 155cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వచ్చింది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇది 10,000rpm వద్ద 18.4PS అలాగే 7,500rpm వద్ద 14.1Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగింది.

సస్పెన్షన్స్ గమనిస్తే మోటార్‌సైకిల్ 37mm అంతర్గత ట్యూబ్‌లతో రివర్స్ ఫ్రంట్ ఫోర్క్‌ను కలిగి ఉంది. 

ఈ బైక్ ధర దిల్లీ ఎక్స్ షోరూమ్ వద్ద రూ. 1,59,900 నుంచి ప్రారంభమవుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్