Xiaomi 13 Pro । షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్ వివరాలు లాంచ్‌కు ముందే లీక్!-xiaomi to launch 13 series soon new model details leaked ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Xiaomi 13 Pro । షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్ వివరాలు లాంచ్‌కు ముందే లీక్!

Xiaomi 13 Pro । షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్ వివరాలు లాంచ్‌కు ముందే లీక్!

HT Telugu Desk HT Telugu

స్మార్ట్‌ఫోన్ మేకర్ తమ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ కొత్త వాటిని పరిచయం చేస్తోంది. ఇటీవలే Xiaomi 12 సిరీస్ పరిచయం చేయగా, మళ్లీ వెంటనే Xiaomi 13 సిరీస్ కూడా ప్రారంభించనుంది.

Xiaomi Phone (HT_PRINT)

స్మార్ట్‌ఫోన్‌ప్రముఖ చైనీస్ టెక్ కంపెనీ షావోమి స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌లను విడుదల చేస్తూ దూకుడు మీద ఉంది. ఇటీవలే Xiaomi 12 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ని అంతర్జాతీయ మార్కెట్ కు పరిచయం చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు Xiaomi 13 సిరీస్‌ను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. నివేదిక ప్రకారం తమ కొత్త సిరీస్ నుంచి Xiaomi 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఇది ప్రీమియం రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్. కొత్తగా రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌లో అన్ని మెరుగైన ఫీచర్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే సరికొత్త Xiaomi 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కూడా లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి. లీకైన ఫీచర్లను ఒకసారి చూద్దాం.

Xiaomi 13 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.73 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
  • 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్
  • వెనకవైపు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్
  • ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం

నివేదికల ప్రకారం Xiaomi 13 Pro స్మార్ట్‌ఫోన్ సిరీస్ ధరలు రూ. 38,500 నుంచి ప్రారంభం అవుతాయి. నలుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో పాటు పింక్ కలర్ ఆప్షన్ లోనూ రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఈ ఏడాది చివరి నెలలో అంటే డిసెంబర్ 2022లో లాంచ్ చేయవచ్చు.

సంబంధిత కథనం