World Food Safety Day |మెరుగైన ఆరోగ్యం కోసం.. ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు అవసరం-world food safety day 2022 special story on food safety ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  World Food Safety Day 2022 Special Story On Food Safety

World Food Safety Day |మెరుగైన ఆరోగ్యం కోసం.. ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు అవసరం

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 07, 2022 11:21 AM IST

మన దైనందిన జీవితంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన, పోషకరమైన ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయం చేస్తుంది. అనారోగ్యకరమైనవి తీసుకుంటే.. అనేక వ్యాధులకు గురై ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహార పద్ధతుల ప్రాముఖ్యతను గుర్తించడానికి, ఏటా జూన్ 7వ తీదీన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2022
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2022

World Food Safety Day 2022 | ఆహారం ద్వారా వచ్చే ప్రమాదాలను నివారించడానికి, తగిన ఆహారం తీసుకోవడానికి.. మంచి ఆహారం పట్ల ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడానికి.. స్థిరమైన పద్ధతిలో మెరుగైన ఆరోగ్యం కోసం ఆహార వ్యవస్థ పట్ల సమగ్ర విధానంపై ఆవశ్యకతను తెలుపుతూ.. WHO ప్రచారం చేస్తుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా.. తినే ఆహారం పట్ల కనీస అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని..WHOకు సంబంధించిన యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నవోకో వెల్లడించారు. అందరూ ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని.. ఇది వారి ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. ఇది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని స్పష్టం చేశారు.

థీమ్..

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదొక థీమ్​ను ఫాలో అవుతారు. దీనిలో భాగంగా ఈ సంవత్సరం "సురక్షితమైన ఆహారం, మెరుగైన ఆరోగ్యం" అనే థీమ్​ను WHO ప్రకటించింది. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా.. 4 ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను అనుసరించాలనిWHO పేర్కొంది. ఆ సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆహారాన్ని ఎల్లప్పుడూ శుభ్రం చేయండి

తినే ముందు ఆహారాన్ని శుభ్రపరచడం అనేది మనం అనుసరించాల్సిన ప్రాథమిక ఆహార పద్ధతుల్లో ఒకటి. అది పండు లేదా కూరగాయ అయినా, వండడానికి లేదా పచ్చిగా తినడానికి ముందు వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. ప్యాక్ చేసిన ఆహారాన్ని ఉపయోగించే ముందు.. కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

2. పచ్చి ఆహారాన్ని విడిగా ఉంచండి

మాంసాహారం, గుడ్లు, సముద్రపు ఆహారం, చేపలు మొదలైన వంటి వాటిని ఎప్పుడూ ఇతర ఆహారాలకు దూరంగా ఉంచాలి. నిజానికి ఈ ఆహారాలను కట్​ చేసేటప్పుడు కూడా.. ప్రత్యేకమైన చాపింగ్ బోర్డ్‌ను ఉపయోగించాలి.

3. ఆహారాన్ని బాగా ఉడికించాలి

పచ్చి ఆహారాన్ని.. ముఖ్యంగా మాంసాన్ని బాగా ఉడికించాలి. వాటిని బాగా వండటం వల్ల వాటిలోని అనారోగ్యకరమైన బ్యాక్టీరియాను నాశనం అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఆహారం సురక్షితంగా వినియోగించేందుకు ఉపయోగపడుతుంది.

4. సరైన శీతలీకరణ

పచ్చి ఆహారం అయినా లేదా వండినది అయినా.. దానిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం చాలా ముఖ్యం. వండిన ఆహారాన్ని ఎల్లప్పుడూ మూతతో నిల్వ చేయాలి. పచ్చి వాటిని విడిగా ఉంచాలి. మాంసం, చేపలు ఫ్రీజర్‌లో ఉంచాలి. కూరగాయలు, పండ్లను.. కూరగాయల నిల్వ విభాగంలో సరిగ్గా నిల్వ చేయాలి. ఇది ఎక్కువ కాలం ఆహారాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్