Vaginal Problems | మెనోపాజ్ కారణంగా కలిగే యోని సమస్యలు ఇవే..-women facing vaginal problems due to menopause ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vaginal Problems | మెనోపాజ్ కారణంగా కలిగే యోని సమస్యలు ఇవే..

Vaginal Problems | మెనోపాజ్ కారణంగా కలిగే యోని సమస్యలు ఇవే..

HT Telugu Desk HT Telugu
May 03, 2022 11:44 PM IST

మెనోపాజ్ సమస్యల వల్ల హాట్ ఫ్లాషెస్, మూడ్ స్వింగ్స్ మాత్రమే కాదు... యోని సమస్యలు కూడా ఎక్కువగానే వస్తాయి. ఆ సమస్యలను ఎవరితోనూ షేర్ చేసుకోలేము. బాధతో లోలోపలే కృంగిపోతాము. అందుకే ఆ సమస్యలను గుర్తించి వెంటనే వైద్యుని సంప్రదించండి.

యోని సమస్యలు
యోని సమస్యలు

Vaginal Problems | మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో మెనోపాజ్ ఒకటి. దీనివల్ల కలిగే సమస్యలు అన్ని ఇన్ని కాదు. మన మూడ్ స్వింగ్వ్ అవ్వడమే కాకుండా.. యోని సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. ఇవి మనకు చాలా ఇబ్బందులను కలిగిస్తాయి. ఈ సమస్యలతో త్వరగా డాక్టర్​ దగ్గరికి వెళ్లలేము. ఎవరితోనూ పంచుకోలేము. కాబట్టి మోనోపాజ్​ వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకుని.. వెంటనే వైద్యుని సంప్రదించండి.

మూత్ర విసర్జన సమయంలో మంట

మూత్ర విసర్జన చేయడం వల్ల మీ సన్నిహిత ప్రాంతం నరకంలా కాలిపోతుంది. మీరు మీ రుతుక్రమం ఆగిన వయస్సుకి దగ్గరగా ఉంటే.. ఇది పూర్తిగా సంకేతాలలో ఒకటని చెప్పవచ్చు. ఇది డీహైడ్రేషన్ వల్ల జరిగే మంట కాదు. రుతువిరతి సమయంలో, శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోవటం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. నొప్పి భరించలేనంతగా ఉంటే వైద్యుని సహాయం కోరండి.

సెక్స్ సమయంలో నొప్పి

ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. పొడి యోని, పెల్విక్ ప్రాంతం చుట్టూ బిగుతుగా ఉండటం, ఇన్ఫెక్షన్ - ఇవన్నీ సాధారణంగా మెనోపాజ్ సమయంలో కనిపిస్తాయి. వీటిలో ఏవైనా బాధాకరమైన సెక్స్‌కు కారణం కావచ్చు. కాబట్టి మీరు సాధారణం కంటే కొంచెం ఎక్కువ నొప్పిని అనుభవిస్తే.. వెంటనే మీరు గైనకాలజిస్టును కలవండి.

యూటీఐ

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది రుతుక్రమం ఆగిన మహిళల్లో సాధారణంగా కనిపించే మరో యోని సమస్య. మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యం, దురద. యోని ఉత్సర్గ మొదలైన అన్ని సాధారణ సంకేతాలతో పాటు.. యూటీఐలో మరొక సంకేతం వెన్నులో నొప్పి. కాబట్టి మీరు లేదా మీ అమ్మ లేదా ఎవరైనా మెనోపాజ్‌కు చేరుకుంటున్నట్లయితే వారు నడుము నొప్పితో బాధపడుతున్నట్లు మీకు అనిపిస్తే.. వైద్యుని సంప్రదించండి.

యోని డ్రైగా ఉండే అవకాశం..

మీ యోని దాని సహజ సరళతను కోల్పోయినప్పుడు యోని డ్రైగా మారే అవకాశముంది. ఇది చిన్న వయస్సులో కూడా జరుగుతుంది. అయితే ఇది సాధారణంగా మెనోపాజ్‌కు చేరుకునే మహిళల్లో కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో మీ యోని నిర్జలీకరణం చెందుతుందని చెప్పడం తప్పు కాదు. ఎక్కువ నీరు తాగడం వల్ల, యోని మాయిశ్చరైజర్లు వాడడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.

వాజినైటిస్

శరీరంలో ఈస్ట్రోజెన్ అసమతుల్యత వల్ల కూడా ఇది జరుగుతుంది. యోని గోడలు సన్నగా, పొడిగా, మంటగా ఉంటాయి. ఇది మీ యోని ప్రాంతం చుట్టూ చాలా అసౌకర్యాన్ని తెస్తుంది. ముఖ్యంగా ఇది మీ యోనిని వివిధ ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్