లిఫ్ట్‌లో అద్దం ఎందుకు ఉంటుందో తెలుసా? అందం కోసం మాత్రం కాదు-why do lifts have mirrors ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  లిఫ్ట్‌లో అద్దం ఎందుకు ఉంటుందో తెలుసా? అందం కోసం మాత్రం కాదు

లిఫ్ట్‌లో అద్దం ఎందుకు ఉంటుందో తెలుసా? అందం కోసం మాత్రం కాదు

Himabindu Ponnaganti HT Telugu
Feb 28, 2022 04:03 PM IST

అపార్టుమెంట్లలో లిఫ్ట్ ఉండటం సహజం. ఈ ఎలివేటర్లు ఉన్నాక ఎవరైనా మెట్లు ఎక్కడానికి ఇష్టపడరు కదా. మీరు గమనించారో లేదో కొన్ని చోట్ల లిఫ్టుల్లో అద్దాలు ఉంటాయి. ఇవి ఎందుకో ఉంచుతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

<p>లిఫ్ట్ లో అద్దం ఎందుకు?&nbsp;</p>
లిఫ్ట్ లో అద్దం ఎందుకు? (pexels)

సాధారణంగా ఎక్కడైనా లిఫ్ట్ ఎక్కితే అందులో అద్దం ఉంటే మన దృష్టి అందంపై పడుతుంది. అద్దంలో ఎలా ఉన్నామో చూసుకుంటూ తెగ మురిసిపోతాం. డ్రెస్ సరి చేసుకుంటారు. కొందరైతే వెంటనే బ్యాగ్ లోని మేకప్ సామాగ్రి తీసేసి చకా చకా రాసేసుకుంటారు.  మరి లిఫ్ట్‌లో అద్దం ఇందుకోసమే పెట్టారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. దీని వెనక మరో కారణం ఉంది. 

సేఫ్టీ కోసమే పెడతారు.. 

లిఫ్టుల్లో అద్దాల్ని సేఫ్టీ కోసం పెడతారట. అవును.. మీరు విన్నది నిజమే. లిఫ్ట్ ఎక్కినప్పుడు మనతో పాటు చాలా మంది ఉంటారు. వారిలో మనకు తెలియని వారుండొచ్చు. అలాంటప్పుడు ఒక్కోసారి కాస్త భయం వేస్తుంది.  అద్దం ఉంటే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండవచ్చు. గుంపులో ఎవరైనా దొంగతనానికి పాల్పడుతున్నారా? అలా వారి మూమెంట్స్ ని మనం గమనించవచ్చు. లిఫ్టులో అద్దం పెట్టడానికి ప్రధాన కారణమిదే.

ఎలివేటర్ల నేపథ్యం.. 

లిఫ్టుల్లో అద్దాలను మొదట జపాన్‌లో ప్రవేశపెట్టారు. వికలాంగులు, వీల్ ఛైర్ వాడేవారు మెట్లు ఎక్కాలంటే చాలా ఇబ్బంది. అలాంటి వారి కోసం ఇవి ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. లిఫ్ట్ ఎక్కి అందులో తమ కుర్చీని వెనక్కి తిప్పడం వారికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు అద్దం సాయంతో వారు ఎక్కడ ఖాళీ ఉందో చూసుకుని వీల్ ఛైర్ సర్దుబాటు చేసుకుంటారు. ఇలాంటి పలు ప్రయోజనాల కోసమే ఎలివేటర్లలో అద్దాలు పెడతారు. 

లిఫ్టులో సాధరణంగా ఎక్కువ ప్లేస్ లేకపోవడం, ఫ్రెష్ ఎయిర్ తగలేకపోవడం వంటి కారణాల వలన చాలా మందికి క్లాస్ట్రోఫోబియా సమస్య ఎదురవుతుంటుంది. ఈ సమస్య ఎదురైనప్పుడు మనలో ఆందోళన పెరిగుతుంది. ఫలితంగా గుండె వేగం అందుకుంటుంది. అరచేతిలో చెమటలు పడుతుంటాయి. అదే లిఫ్ట్ లో అద్దం ఉండడం, దాని చూడటం వలన ఇలాంటి ఆందోళనలు ఉండవు. అంతేకాదు అవసరాన్ని మించి ఎవరైనా లిఫ్ట్ ఎక్కినా ఇరుకుగా ఉందనే ఫీల్ లేకుండా చేస్తుంది అద్దం. ఒక్క అద్దం ఎన్ని పనులు చేస్తుందో చూడండి.

లిఫ్ట్ లో బోర్ గా నిలుచునే బదులు అద్దంలో తమని తాము చూసుకుంటూ, ఇతరులను కూడా గమనించవచ్చు. అదే అద్దం లేకపోతే నేల చూపులు చూస్తూ ఉండడం వలన అక్కడ ఉండే నిమిషం, రెండు నిమిషాలు కూడా ఎంతో సమయం ఉన్న భావన వస్తుందట. ఇన్ని సమస్యలు తగ్గిస్తుంది కాబట్టి లిఫ్ట్ లో అద్దాన్ని పెడుతుంటారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం