తక్కువగా నీరు త్రాగుతున్నారా? అయితే ఈ కష్టాలు తప్పవు!-what happens to your body when you don t drink enough water ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  What Happens To Your Body When You Don't Drink Enough Water

తక్కువగా నీరు త్రాగుతున్నారా? అయితే ఈ కష్టాలు తప్పవు!

HT Telugu Desk HT Telugu
Aug 19, 2022 10:39 PM IST

శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలంటే సరైన మోతాదులో నీరు తాగడం చాలా ముఖ్యం. సరైన మోతాదులో నీళ్లు తాగకపోవడం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Drinking water
Drinking water

బతకడానికి గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే ముఖ్యం. ప్రతి రోజు సరైన మోతాదులో నీరు త్రాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. సాధారణంగా మన శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. కాబట్టి శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలంటే సరైన మోతాదులో నీరు తాగడం చాలా ముఖ్యం. ఇది మీ శరీరాన్ని అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అయితే ప్రతి రోజు సరైన మోతాదులో నీళ్లు తాగకపోవడం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులు గురించి తెలుసుకుందాం.

ఊబకాయం: నీరు తక్కువగా తాగడం వల్ల స్థూలకాయం ఏర్సడుతుంది. ఇది సమస్య అనేక వ్యాధులకు కారణమవుతుంది . ముఖ్యంగా తక్కువ నీరు తాగడం వల్ల ఊబకాయం పెరుగుతుంది. సరైన పరిమాణంలో ఆహారం తీసుకున్నప్పటికీ.. కానీ సరైన మోతాదు నీటిని త్రాగారు, దీని కారణంగా ఎక్కువగా ఆకలి అవుతుంటుంది. దీంతో ఎక్కువసార్లు ఆహారం తీసుకుంటే ఊబకాయానికి గురవుతాం. కాబట్టి శరీరంలో తగినంత నీరు ఉండటం చాలా ముఖ్యం.

ఉదర సమస్యలు: తక్కువ నీరు తాగడం వల్ల కడుపులో మలబద్ధకం కూడా మొదలవుతుంది. మనం తగినంత నీరు తాగకపోతే మలబద్ధకం పెరుగుతుంది. నీరు లేకపోవడం వల్ల కడుపులో ఆమ్లం ఏర్పడే రేటు పెరుగుతుంది, ఇది కడుపులో గ్యాస్ ఏర్పడటానికి కారణమవుతుంది. అంతే కాకుండా నీరు తక్కువగా తాగడం వల్ల గుండెల్లో మంట వస్తుంది.

హాలిటోసిస్: నీటి కొరత కారణంగా, నోటి దుర్వాసన సమస్య గణనీయంగా పెరుగుతుంది, తక్కువ నీరు తాగడం వల్ల నోరు ఎండిపోతుంది, ఫలితంగా నోటి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దీంతో నోటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. కాబట్టి నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఎక్కువగా నీరు త్రాగాలి.

WhatsApp channel

సంబంధిత కథనం