Wednesday Motivation : దీనికన్నా పోయేదేముందని అనిపించినప్పుడే.. మన సామర్థ్యాలు బయటకు వస్తాయి..-wednesday motivation on you never know how strong you are until being strong is your only choice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Wednesday Motivation On You Never Know How Strong You Are Until Being Strong Is Your Only Choice

Wednesday Motivation : దీనికన్నా పోయేదేముందని అనిపించినప్పుడే.. మన సామర్థ్యాలు బయటకు వస్తాయి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 20, 2022 09:20 AM IST

జీవితంలో ప్రతి ఒక్కరూ అప్​ అండ్​ డౌన్స్ చూడాల్సి వస్తుంది. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే.. మీకు గెలుపు ఒక్కటే ఛాయిస్ అనేట్టు చేస్తాయి. డూ ఆర్ డై వంటి పరిస్థితుల్లో మీరు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. పరిస్థితులు మనకు అనుకూలించనప్పుడు మనకు ఇంకో ఛాయిస్ ఉండదు. కచ్చితంగా గెలవడం ఒక్కటే మనకు ఛాయిస్. అలా గెలిచినప్పుడే మనం కొత్త లైఫ్​ని చూస్తాము.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : ఓ మనిషి ఎంత స్ట్రాంగ్ అనేది.. డూ ఆర్ డై సిట్యువేషన్‌లోనే తెలుస్తుంది. ఆ సమయంలో ఎంత స్ట్రాంగ్​గా ఉంటే.. అంత మంచిది. స్ట్రాంగ్​గా లేకపోతే మాత్రం మీరు ఎప్పటికి బౌన్స్ కాలేరు. ఆ టైమ్​లో ఓ వ్యక్తి భౌతికంగానే కాకుండా.. మానసికంగా కూడా ఎంత బలంగా ఉన్నాడో తెలుస్తుంది. అదే తనలోని అసలైన స్ట్రెంత్​ని బయటకు తీసుకువస్తుంది.

జీవితంలో ఇంక చేయడానికి ఏమి లేదు.. అన్నిరకాలుగా డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు దీనిని చేయలేము. నన్ను నేను ప్రూవ్ చేసుకోకపోతే.. ఎప్పటికీ ప్రూవ్ చేసుకోలేను. నాకు ఎక్కువ టైమ్ లేదు.. ఏది చేసినా ఇప్పుడే చేయాలి అనే పరిస్థితి.. జీవితంలో ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ సమయంలో భౌతికంగా బలంగా లేకపోయినా.. మానసికంగా మాత్రం కచ్చితంగా బలంగా ఉండాలి. చేసే పని పట్ల అంకితభావం ఉండాలి. అంతేకాకుండా పరిస్థితులను పూర్తిగా అంచనా వేయాల్సి వస్తుంది. ఆ సమయంలో మానసికంగా ఎంత దృఢంగా ఉంటే అంత మంచిది. కచ్చితంగా దృఢంగా ఉండాలి కూడా. అలా ఉంటేనే మన జీవితంలో గణనీయమైన పురోగతిని సాధించగలుగుతాము. లేదంటే మీ గెలుపు, మీ గోల్స్ అన్ని కనుమరుగు అయిపోతాయి.

కొన్నిసార్లు సమస్యలు మనల్ని చుట్టుమట్టేస్తాయి. బతికే ఆశలేకుండా చేస్తాయి. జీవితం చిన్నాభిన్నం అయిపోతుంది. మానసికంగా విచ్ఛిన్నం అయిపోతాము. జీవితంలో ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఆ సమయంలోనే మనం చాలా విలువైన పాఠాలు నేర్చుకుంటాము. ఇవి మనల్ని ఫిజికల్​గా, మెంటల్​గా స్ట్రాంగ్​గా అయ్యేలా చేస్తాయి. అప్పుడే మనం మన సామర్థ్యాలను గుర్తిస్తాము.

ఇంతకుమించి కోల్పోవడానికి ఏమి లేదు అన్నప్పుడే.. మనం దేనికి భయపడము. విజయం, టార్గెట్​ తప్పా.. మరొకటి చూడము. ఆ రకంగా మన మనసును ట్రైన్ చేస్తాము. జీవితంలో విజయం సాధించడానికి.. సంకల్పశక్తి చాలా అవసరం. అది మనల్ని సక్సెస్​ అయ్యేలా ప్రేరేపిస్తుంది. ఆ సమయంలో ఏమాత్రం చంచలంగా ఉన్నా.. టార్గెట్ మిస్ అయిపోతుంది.

ప్రేరణ ఎప్పుడైనా లోపలి నుంచి రావాలి. అది ఎవరో చెప్తేనో.. ఏదో చూస్తేనో వచ్చేది కాదు. మనం సెల్ఫ్​గా రియలైజ్ అయినప్పుడు.. ఆ ప్రేరణ ఎక్కువ సమయం మనలో ఉంటుంది. ప్రయాణాన్ని ఉత్తేజకరమైనదిగా మారుస్తుంది. మన చర్యల ఫలితం గురించి భయపడకుండా చేస్తుంది. మరో అడుగు ముందుకు వేసి.. సక్సెస్​ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే జీవితంలోని అనేక వైఫల్యాలు విజయానికి దగ్గరగా వెళ్లినవే.

అయినా విజయం అనేది ఒక ప్రయాణం. అది గమ్యం కాదని గుర్తుంచుకోవాలి. యుద్ధంలో గెలవడం అంటే ప్రత్యర్థిని చంపడం కాదు.. ప్రాణాలతో విడిచి పెట్టడం అని ఓ సినీకవి చెప్పినట్లుగా. టార్గెట్ ఎప్పుడూ గమ్యం కాదు. అది ఒక ప్రయాణమే. అది మళ్లీ మళ్లీ గెలవాలనే పట్టుదల, ఓపికను ఇస్తుంది. మన ప్రయత్నాలను స్థిరంగా, అంకితభావంతో చేయాలి. మన లక్ష్యాలను సాధించడానికి కష్టపడాలి. గెలవడం అనేది నిజానికి ఒక అలవాటు. క్లిష్ట పరిస్థితులు మనల్ని గెలిచేలా తయారు చేస్తాయి. జీవితంలో మనుగడకు సంబంధించిన వ్యూహాలను నేర్పుతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్