Benefits Or Bad: గుడ్ల పెంకులు పడేస్తున్నారా..? వాటిని ఇలా ఉపయోగించండి!-useful uses for egg shells that will inspire you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Useful Uses For Egg Shells That Will Inspire You

Benefits Or Bad: గుడ్ల పెంకులు పడేస్తున్నారా..? వాటిని ఇలా ఉపయోగించండి!

HT Telugu Desk HT Telugu
Mar 21, 2022 02:35 PM IST

రానికి కావాల్సిన తొమ్మిది రకాల ప్రోటీన్స్ గుడ్డు ద్వారా లభిస్తాయి. ముఖ్యంగా ఉడకబెట్టిన గుడ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఉండే ప్రోటీన్ ఇది గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలను తగ్గిస్తాయి. కేవలం బాయిల్ చేసిన గుడ్లతోనే కాదు పెంకుతో కూడా అనేక లాభాలు ఉన్నాయి. .

egg shells
egg shells

గుడ్లు పోషకాల గని. శరీరానికి కావాల్సిన తొమ్మిది రకాల ప్రోటీన్స్ గుడ్డు ద్వారా లభిస్తాయి. ముఖ్యంగా ఉడకబెట్టిన గుడ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఉండే ప్రోటీన్ ఇది గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలను తగ్గిస్తాయి. కేవలం బాయిల్ చేసిన గుడ్లతోనే కాదు పెంకుతో కూడా అనేక లాభాలు ఉన్నాయి. . వాటిని గుడ్డును వేరు చేసిన తర్వాత చాలా మంది పెంకులను చెత్త బుట్టలో పడేస్తుంటారు. ఈ షెల్స్‌ను వివిధ ఇంటి చిట్కాలకు.. సౌందర్య చికిత్సలకు ఉపయోగపడుతుంది. మీకు తెలుసా. గుడ్డు షెల్ ద్వారా ఏఏ లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  • మడిపోయిన పాన్‌ను మళ్లీ మెరిసేలా చేయడానికి గుడ్డు షెల్ ఉపయోగించవచ్చు.
  • కాలిన గాయాలను తగ్గించుకోవడానికి కూడా గుడ్డు పెంకులు ఉపయోగపడుతాయి. ముందుగా గుడ్డు పెంకులను రుబ్బుకోవాలి. ఆ పొడిని,ఉప్పును వేసిన నీటిలో మరిగించాలి. తర్వాత కాలిన గాయాలపై ఆ ద్రావణాన్ని పూసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో కాలిన గాయాలు తేలికగా పోతాయి.
  • గదిలో ఒక మూలలో గుడ్డు షెల్ ఉంచడం ద్వారా బల్లులు రాకుండా చూసుకోవచ్చు
  • వీటిని చెట్టుకు ఎరువుగా ఉపయోగించవచ్చు. గుడ్ల పెంకులను తిసి చెట్ల మధ్య వేయడం ద్వారా అవి కుళ్ళీ వాటికి ఎరువుగా మారతుంది.
  • ఎగ్ షెల్‌తో తయారు చేసే స్క్రబ్ ద్వారా మీరు చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. బంగాళాదుంపలను తురుముకుని, వాటి రసానికి, పెంకుల పోడిని కలిపి గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయండి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. మృతకణాలు కూడా తొలగిపోతాయి.
  • మీరు ఆర్థరైటిస్ నొప్పితో బాధపడుతున్న వారికి ఇది ఉపయోగపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌తో గుడ్డు షెల్ పౌడర్ మిక్స్ చేసి రెండు రోజులు అలాగే ఉంచాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయండి. ఎక్కువ రోజులు వాడితే ఉపశమనం కలుగుతుంది.
  • గుడ్డు పెంకులను పక్షులకు ఆహారంగా కూడా ఉపయోగించవచ్చు. గుడ్డు షెల్ రుబ్బు దాన్ని ఇంటి పైకప్పు పైనా కంటైనర్‌లో ఉంచాలి.
  • మీరు ఇంటి ఇంటీరియర్ డెకరేషన్ కోసం కూడా ఈ షెల్ ను ఉపయోగించవచ్చు. గుడ్డు షెల్తో కొవ్వొత్తిని తయారు చేయవచ్చు. వైట్ షెల్ స్ప్రే పెయింట్ ఉపయోగించి మీరు వివిధ ఇంటి అలంకరణ సామగ్రిని తయారు చేయవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం