Dark Underarms | బాహుమూలాల్లో పిగ్మెంటేషన్ పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి!-treat dark armpits with these home remedies ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dark Underarms | బాహుమూలాల్లో పిగ్మెంటేషన్ పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి!

Dark Underarms | బాహుమూలాల్లో పిగ్మెంటేషన్ పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి!

HT Telugu Desk HT Telugu
May 12, 2022 04:42 PM IST

అధిక చెమటకు కొందరి బాహుమూలాలు నల్లగా మారతాయి. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి ఇక్కడ 5 అద్భుతమైన పరిష్కార మార్గాలున్నాయి..

dark armpits- home remedies
dark armpits- home remedies (Pixabay)

వేసవిలో వేడికి చెమట ఎక్కువ పడుతుంది. కొందరికి బాహుమూలాల్లో ఏర్పడే అధిక చెమట కారణంగా బ్యాక్టీరియా పెరిగి ఆ ప్రాంతం నుంచి దుర్వాసన రావడమే కాకుండా అక్కడి చర్మం నల్లగా మారుతుంది. అబ్బాయిలకు దీనితో పెద్దగా ఇబ్బంది లేకపోయినా కాలానికి తగినట్లుగా ఫ్యాషనబుల్‌గా ఉండాలనుకే అమ్మాయిలకు మాత్రం ఇబ్బందే. స్లీవ్‌లెస్ షర్టులు, పొట్టి స్కర్టులు ధరించినపుడు చేతులు పైకెత్తాలంటే అక్కడి ప్రాంతం నల్లబడి ఉండటం చేత చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. దీంతో ఇష్టమైన దుస్తులను ధరించడంలో మీ విశ్వాసం సన్నగిల్లుతుంది.

చర్మంపై వివిధ భాగాల వద్ద పిగ్మెంటేషన్ సమస్య ఏర్పడినప్పుడు సబ్బుతో స్క్రబ్బింగ్ చేసినంత మాత్రాన ఫలితం ఉండదు. బాహుమూలాల్లోని చర్మం టోన్‌ మిగతా చోట చర్మంలాగా సమానంగా ఉండాలంటే నిపుణులు కొన్ని సులభమైన బ్యూటీ టిప్స్ అందిస్తున్నారు. ఈ టిప్స్ వాడితే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా చేతులు పైకెత్తవచ్చు, అందంగా కనిపించవచ్చు.

చంకలు, మోచేతులు, మోకాళ్లను కాంతివంతంగా మార్చగల 5 అద్భుతమైన హోం రెమెడీస్ ఇవే:

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె చర్మాన్ని సజీవంగా ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా హైడ్రేట్ చేస్తుంది, మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది. కొబ్బరిలో విటమిన్ ఇ ఉంటుంది, ఇది చర్మంపైన పిగ్మెంటేషన్ ను నయం చేయడానికి అలాగే ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుంది.

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో ఒక టేబుల్ స్పూన్ వాల్‌నట్ పౌడర్ కలిపి పేస్ట్ చేయండి. రాత్రివేళలో దీనిని మీ అండర్ ఆర్మ్స్, మోకాళ్లు , మోచేతులపై అద్దుతూ రెండు మూడు నిమిషాల పాటు స్క్రబ్ చేయండి. అనంతరం నీటితో శుభ్రం చేసుకోండి. ఆపై నల్లగా మారిన ప్రాంతాలలో కొబ్బరి నూనె రాసి పడుకోండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తూ ఉండండి. ఫలితం కనిపిస్తుంది.

బంగాళదుంప

ఆలుగడ్డ ఒక రకమైన పుల్లని రుచిని కలిగి ఉంటుంది. దీనిలోని ముదురు వర్ణద్రవ్యం చర్మాన్ని చికాకు పెట్టదు. దీనిని మీ చంకలతో పాటు నల్లగా మారిన ఇతర సున్నితమైన చర్మంపై కూడా ఉపయోగించవచ్చు.

ఒక సన్నని బంగాళాదుంప ముక్కను తీసుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు చంకలు, మోకాళ్లు మరియు మోచేయిలపై రుద్దుతూ ఉండండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తూ ఉండండి. మీ చర్మం రంగు మారడాన్ని మీరు గమనించవచ్చు.

దోసకాయ

దోసకాయలో చర్మాన్ని కాంతివంతం చేసే వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. చర్మాన్ని చల్లబరిచే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగిఉంటుంది. దోసకాయ ముక్కలను రుద్దటం చేయాలి లేదా దోసకాయ, పసుపు కలిపి పేస్టుగా మార్చి అండర్ ఆర్మ్‌లకు అప్లై చేయవచ్చు. ఇలా ఒక 20 నిమిషాల పాటు ఉంచుకొని కడుక్కోవాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తూ ఉండండి.

పెరుగు

పెరుగులో మెరుగైన మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ముఖం కాంతివంతంగా అవడానికి చాలామంది పెరుగుతో ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేస్తారు. ఇదే ఫార్ములా ఇతర శరీర భాగాలకు పనిచేస్తుంది.

పుల్లటి పెరుగులో ఒక టీస్పూన్ వెనిగర్, చిటికెడు శెనగపిండి వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని చంకలపై సమానంగా అప్లై చేయండి. 15 నిమిషాల తరువాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

యాపిల్ సైడర్ వెనిగర్‌

యాపిల్ సైడర్ వెనిగర్‌లోని జివ్వుమనిపించే పుల్లని పదార్థం చర్మం తెల్లబరిచే ఒక బ్లీచింగ్ ఏజెంట్ లాగా సహాయపడుతుంది.

ఒక భాగం ఆపిల్ సైడర్ వెనిగర్‌కు మూడు భాగాల నీటితో కలపండి. కాటన్ బాల్ ఉపయోగించి మీ అండర్ ఆర్మ్స్, మోకాళ్లు, మోచేతులకు ఈ ద్రావణాన్ని అద్దుతూ ఉండండి. కనీసం పదిహేను నిమిషాలు ఉంచుకొని ఆ తర్వాత శుభ్రం చేసుకోండి. వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఇలా ప్రయత్నించండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్