Teeth Whitening | మిళమిళ మెరిసే పళ్లు కావాలా? అయితే ఇవి ట్రై చేయండి-top five home made remedies for teeth brightening ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Teeth Whitening | మిళమిళ మెరిసే పళ్లు కావాలా? అయితే ఇవి ట్రై చేయండి

Teeth Whitening | మిళమిళ మెరిసే పళ్లు కావాలా? అయితే ఇవి ట్రై చేయండి

Vijaya Madhuri HT Telugu
Mar 03, 2022 10:33 AM IST

ముత్యాల లాంటి తెల్లటి దంతాలు కావాలని ఎవరికుండదు? అవి నోటి ఆరోగ్యానికి సంకేతమే కాకుండా మనకి సౌందర్యాన్ని కూడా అందిస్తాయి. కానీ మన వయసు పెరిగే కొద్ది.. దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. ఇవే కాకుండా.. ఇంకా చాలా కారణాలతో దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. వాటికి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే ఇవి చేయాల్సిందే.

దంతాల మెరుపుకోసం చిట్కాలు
దంతాల మెరుపుకోసం చిట్కాలు

Teeth Brightening | దంతాలు తెల్లబడటం కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారు. వయసుతోపాటు దంతాలు రంగు మారడం సహజం. అలాగే కొన్ని అలవాట్లని బట్టి కూడా పళ్లు రంగు మారిపోతాయి. పసుపు పచ్చ రంగులో మారి ఇబ్బందికరంగా కనిపిస్తాయి. కాబట్టి వీటిని తెల్లగా మార్చుకునేందుకు చాలా ప్రయత్నిస్తాం. దంతాలు తెల్లబడటం కోసం.. దంత వైద్యుడిని సంప్రదించడం మెచ్చుకోదగిన విషయమే. కానీ అలా వెళ్లలేనివారు ఇంట్లో ఉండే దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. ఈ 5 సమర్థవంతమైన చిట్కాలతో మీ పళ్లను దంతాలను మెరుగుచేసుకోవచ్చు.

1. ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్​ సైడర్ వెనిగర్ జుట్టు, ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. దంతాలను తెల్లగా మార్చడానికి కూడా ఉపయోగించవచ్చు. జర్నల్ ఆఫ్ సిచువాన్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో యాపిల్ సైడర్ వెనిగర్ ఆవు దంతాలపై బ్లీచింగ్ ప్రభావాన్ని చూపుతుందని తేలింది.

ఎలా ఉపయోగించాలి..

2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను 200 మి.లీ నీటిలో కలపడం ద్వారా మౌత్ వాష్ తయారు చేసుకోవచ్చు. 30 సెకన్ల పాటు ఈ మౌత్ వాష్​ను వేసుకుని.. అన్ని మూలలకు వెళ్లేలా కడగాలి. ఇది మీ దంతాల మీద బ్లీచింగ్ ప్రభావాన్ని చూపుతుంది. దీనిని ఉపయోగించే ముందు.. యాపిల్​ సైడర్ వెనిగర్​ను పలుచగా చేసే ఉపయోగించాలి. అంతే కాకుండా ఎక్కువ సేపు నోటిలో ఉంచుకోకుండా చూసుకోవాలి.

2. ఫ్రూట్ పీల్స్

నిమ్మ, నారింజ, అరటి వంటి కొన్ని పండ్ల తొక్కలలో విటమిన్ సి, డి-లిమోనెన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు అంశాలు మీ దంతాలను సహజంగా తెల్లగా మారుస్తాయి. అంతేకాకుండా, అమెరికన్ జర్నల్ ఆఫ్ డెంటిస్ట్రీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం దంతాల మరకలను తొలగించడంలో 5 శాతం డి-లిమోనెన్.. టూత్‌పేస్ట్ వలె సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నట్లు గుర్తించింది. డి-లిమోనెన్​తో తయారు చేసిన టూత్​పేస్ట్​తో ప్రతిరోజూ బ్రష్ చేస్తే.. దంతాలపై ఉన్న మరకలు గణనీయంగా తగ్గినట్లు గమనించారు.

జర్నల్ ఆఫ్ ఫిజిక్స్‌లో ప్రచురితమైన మరొక అధ్యయనం ప్రకారం సిట్రిక్ యాసిడ్ దంతాలపై ప్రభావం చూపి.. తెల్లబడేలా చేస్తాయని అధ్యయనంలో తేలింది. కానీ మీరు పీల్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఎనామెల్‌ను చెరిపివేస్తాయి. దీనివల్ల దంతాలు సున్నితంగా దెబ్బతింటాయి.

3. ఆయిల్ పుల్లింగ్

ఆయిల్ పుల్లింగ్ అనేది మీరు కొబ్బరి నూనెను మౌత్ వాష్‌గా ఉపయోగించాల్సిన పద్ధతి. 2015 అధ్యయనం కూడా పసుపు రంగుకు దోహదపడి.. దంతాలపై ఏర్పడిన పసుపు పొరను తొలగించడంలో ఆయిల్ పుల్లింగ్ ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొంది.

4. బేకింగ్ సోడా

మీ దంతాలపై పసుపు మరకలను తొలగించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధనలో బేకింగ్ సోడా దంతాలను తెల్లగా మార్చడానికి సురక్షితమైన మార్గంగా గుర్తించబడింది. అంతేకాకుండా, ఇది బాక్టీరియాతో పోరాడుతుందని పేర్కొంది.

5. నోటి పరిశుభ్రత ముఖ్యం

నోటి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజూ మీ దంతాలను బ్రష్ చేయడం, ఫ్లాస్ చేయడం చాలా అవసరం. దంతాల పసుపు రంగును నివారించడానికి మీరు చేయగలిగే ముఖ్యమైన విషయాలలో ఇది ఒకటి. మీ దంతాలను ప్రతిరోజూ బ్రష్ చేయడం, ఫ్లాస్ చేయడం ద్వారా ఎనామిల్‌ను రక్షించుకోవచ్చు. పైగా మరకలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

ఇంటి చిట్కాలను పాటించే ముందు దంత వైద్యుడిని సంప్రదిస్తే.. మీ దంతాలకు హాని కలగకుండా.. వాటిని ఎలా వినియోగించాలో తెలుసుకోవచ్చు.

WhatsApp channel