ఈ అలవాట్లు కిడ్నీల‌కి చాలా హానికరం.. మానేయకపోతే ఇక మీ కిడ్నీలు అంతే..!-this foods to avoid if you have kidney disease ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  This Foods To Avoid If You Have Kidney Disease

ఈ అలవాట్లు కిడ్నీల‌కి చాలా హానికరం.. మానేయకపోతే ఇక మీ కిడ్నీలు అంతే..!

HT Telugu Desk HT Telugu
Jul 03, 2022 07:35 PM IST

Harmful Foods For Kidney: మూత్ర పిండాలు మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. అయితే కొన్ని చెడు ఆహాపు అలవాట్లు కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి అలాంటి ఆహారపు అలవాట్లను కొనసాగించడం వల్ల భవిష్యత్తులో అరోగ్యానికి హానికరంగా మారవచ్చు.

Kidney
Kidney

శరీరంలో కిడ్నీలు పరిమాణం చిన్న మొత్తంలో ఉన్నప్పటికీ ఆరోగ్య రీత్యా ముఖ్య పాత్ర పోషిస్తాయి. శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంసడంలో మూత్రపిండాలు మహత్వపూర్ణమైన అవయం. మూత్రం ఉత్పత్తితో పాటు రక్త ప్రసరణ వ్యవస్థను సజావుగా నిర్వహించే హార్మోన్లను కూడా స్రవిస్తుంది. అయితే ముఖ్య అవయవాన్ని అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా కీడ్నిలపై అధిక ప్రభావం పడుతుంది. సరైన ఆహారపు అలవాట్లు లేని కారణంగా కిడ్నీలో ఇన్ఫెగక్షన్, స్టోన్, క్యాన్సర్ మొదలైన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి.

మూత్రపిండాల సమస్యను ఆరంభంలోనే గుర్తించాలి

మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్థాలను తొలగించేందుకు కిడ్నీ పని చేస్తుంది. కిడ్నీ సమస్యను తొలిదశలో గుర్తించిన వారు ఆహారంలో మార్పులు చేయాలి. కానీ చాలా మంది వచ్చే సమస్యలు చివరి దశలో గుర్తిస్తారు, దీని కారణంగా వ్యాధి ముదిరి డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది.

మూత్రపిండాల సమస్యల ప్రారంభ సంకేతాలు

ఆకలి నశించడం

శరీరంలో వాపు

చలిగా అనిపించడం

చర్మంపై దద్దుర్లు

మూత్ర విసర్జనలో ఇబ్బంది

చిరాకు

మూత్రపిండాల సమస్యలకు కారణాలు

ఆల్కహాల్: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ దెబ్బతింటుంది. ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరులో సమస్యలు తలెత్తుతాయి, అది మెదడుపై ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపడమే కాకుండా ఇతర అవయవాలకు కూడా హానికరం.

ఉప్పు: ఉప్పులో సోడియం ఉంటుంది. ఉప్పును ఎక్కువగా తీసుకుంటే, అది శరీరంలో ద్రవం పరిణామం పెంచుతుంది, ఇది మూత్రపిండాలపై ఎక్కువ ఒత్తిడి పెంచుతుంది.

పాల ఉత్పత్తులు: పాలు, చీజ్, వెన్న వంటి పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం మూత్రపిండాలకు మంచిది కాదు. పాల ఉత్పత్తులలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. పాల ఉత్పత్తులలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. అందువల్ల, వాటిని అధిక వినియోగం నివారించండి.

రెడ్ మీట్: రెడ్ మీట్‌లో ప్రొటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి, అయితే మన శరీరానికి ప్రొటీన్లు కూడా అవసరం. మూత్రపిండాలను ప్రభావితం చేసే అటువంటి మాంసాన్ని జీర్ణం చేయడం శరీరానికి కష్టంగా మారుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్