Long weekends in 2023: లాంగ్ వీకెండ్స్ జాబితా ఇదే.. టూర్ ప్లాన్ చేద్దామా మరి-the complete list of long weekends in 2023 to plan more than 15 vacations ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Long Weekends In 2023: లాంగ్ వీకెండ్స్ జాబితా ఇదే.. టూర్ ప్లాన్ చేద్దామా మరి

Long weekends in 2023: లాంగ్ వీకెండ్స్ జాబితా ఇదే.. టూర్ ప్లాన్ చేద్దామా మరి

HT Telugu Desk HT Telugu
Dec 23, 2022 10:50 AM IST

Long Weekends 2023 List: 2023లో లాంగ్ వీకెండ్స్ చాలా వస్తున్నాయి. మరి జాగ్రత్తగా ఇలా టూర్ ప్లాన్ చేద్దామా?

The complete list of long weekends in 2023: రానున్న సంవత్సరంలో లాంగ్ వీకెండ్స్ జాబితా
The complete list of long weekends in 2023: రానున్న సంవత్సరంలో లాంగ్ వీకెండ్స్ జాబితా (Unsplash )

2022 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మరో వారం రోజులైతే కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. కొత్త సంవత్సరం టూర్లు, ట్రావెల్‌తో ప్రారంభించాలనుకుంటే మాత్రం ఒకసారి క్యాలెండర్‌లోకి తొంగి చూడండి. ట్రావెల్ ఇష్టపడేవారికి శుభవార్త ఏంటంటే ఈసారి లాంక్ వీకెండ్స్ చాలా వస్తున్నాయి. మార్చి, ఏప్రిల్, ఆగస్టు మాసాల్లో అయితే వరుసగా ఐదారు రోజుల సెలవులు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే 18 వెకేషన్స్ ఎంజాయ్ చేయొచ్చు. మరి 2023లో లాంక్ వీకెండ్స్ ఏవో చూద్దామా?

Long Weekend in January 2023: జనవరిలో లాంగ్ వీకెండ్స్

1) డిసెంబర్ 31, శనివారం: నూతన సంవత్సర వేడుకలు షురూ చేయండి.

జనవరి 1, ఆదివారం: నూతన సంవత్సరం రోజు

అంటే మీరు డిసెంబర్ 30 శుక్రవారం సెలవు తీసుకుంటే, మీకు మూడు రోజులు సెలవు లభిస్తుంది. మీరు జనవరి 2, సోమవారం రోజు సెలవు తీసుకోవడం ద్వారా కూడా ఈ సెలవును పొడిగించవచ్చు.

2) జనవరి 14, శనివారం: లోహ్రీ, మకర సంక్రాంతి

జనవరి 15, ఆదివారం: పొంగల్

వీలుంటే నాలుగు రోజులు సెలవు పొందడానికి జనవరి 13 (శుక్రవారం), జనవరి 16 (సోమవారం) రోజు సెలవు తీసుకోండి.

3) జనవరి 26, గురువారం: గణతంత్ర దినోత్సవం

జనవరి 28, శనివారం

జనవరి 29, ఆదివారం

నాలుగు రోజుల సెలవులను ఆస్వాదించడానికి జనవరి 27, శుక్రవారం సెలవు తీసుకోండి.

ఫిబ్రవరి 2023లో లాంగ్ వీకెండ్

1) ఫిబ్రవరి 18, శనివారం: మహాశివరాత్రి

ఫిబ్రవరి 19, ఆదివారం

ఫిబ్రవరి 17, శుక్రవారం రోజు సెలవు తీసుకోండి.

మార్చి 2023లో లాంగ్ వీకెండ్

1) మార్చి 8, బుధవారం: హోలీ

మార్చి 11, శనివారం

మార్చి 12, ఆదివారం

మీరు ఐదు రోజుల విహారయాత్ర కోసం మార్చి 9 గురువారం, మార్చి 10 శుక్రవారం బయలుదేరవచ్చు.

మార్చి 22 బుధవారం ఉగాది. గురు, శుక్ర సెలవులు పెట్టడం ద్వారా లాంగ్ వీకెండ్ టూర్ ప్లాన్ చేయొచ్చు.

ఇక మార్చి 30, గురువారం శ్రీరామ నవమి. మార్చి 31 శుక్రవారం సెలవు పెట్టడం ద్వారా నాలుగు రోజులు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.

ఏప్రిల్ 2023లో లాంగ్ వీకెండ్

1) ఏప్రిల్ 4, మంగళవారం: మహావీర్ జయంతి

ఏప్రిల్ 7, శుక్రవారం: గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 8, శనివారం

ఏప్రిల్ 9, ఆదివారం

ఆరు రోజుల పాటు సెలవు కోసం ఏప్రిల్ 5 బుధవారం, ఏప్రిల్ 6 గురువారం సెలవులు తీసుకోండి.

ఏప్రిల్ 21, శుక్రవారం రంజాన్ పండగ వస్తోంది. శని, ఆది వారాలు కలిసి మూడు రోజుల పాటు టూర్ వెళ్లొచ్చు.

మే 2023లో లాంగ్ వీకెండ్

1) మే 5, శుక్రవారం: బుద్ధ పూర్ణిమ

మే 6, శనివారం

మే 7, ఆదివారం

జూన్, జూలై 2023లో లాంగ్ వీకెండ్

1) జూన్ 17, శనివారం

జూన్ 18, ఆదివారం

జూన్ 20, మంగళవారం: రథయాత్ర (కొన్ని ప్రాంతాల్లో సెలవుదినం)

సెలవును నాలుగు రోజులు పొడిగించడానికి జూన్ 19, సోమవారం సెలవు తీసుకోండి.

2) జూన్ 29, గురువారం: బక్రీద్

జూలై 1, శనివారం

జూలై 2, ఆదివారం

జూన్ 30, శుక్రవారం సెలవు తీసుకుంటే నాలుగు రోజుల వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు.

ఆగస్ట్ 2023లో లాంగ్ వీకెండ్

1) ఆగస్టు 12, శనివారం

ఆగస్టు 13, ఆదివారం

ఆగష్టు 15, మంగళవారం: స్వాతంత్య్ర దినోత్సవం

ఆగష్టు 16, బుధవారం: పార్సీ నూతన సంవత్సరం (పరిమిత సెలవుదినం)

ఐదు రోజుల సుదీర్ఘ సెలవులకు వెళ్లడానికి ఆగస్టు 14, సోమవారం సెలవు పెట్టేయొచ్చు.

2) ఆగస్టు 26, శనివారం

ఆగస్టు 27, ఆదివారం

ఆగస్టు 29, మంగళవారం: ఓనం (పరిమిత సెలవు)

ఆగస్టు 30, బుధవారం: రక్షా బంధన్

ఐదు రోజుల ఆనందాన్ని ఆస్వాదించడానికి మీరు ఆగస్టు 28 సోమవారం నాడు సెలవు ప్లాన్ చేయండి.

సెప్టెంబర్ 2023లో లాంగ్ వీకెండ్

1) సెప్టెంబర్ 7, గురువారం: జన్మాష్టమి 

సెప్టెంబర్ 9, శనివారం

సెప్టెంబర్ 10, ఆదివారం

సెప్టెంబరు 8, సోమవారం సెలవు తీసుకోవడం ద్వారా, మీరు నాలుగు రోజుల పాటు టూర్ వెళ్ళవచ్చు.

2) సెప్టెంబర్ 16, శనివారం

సెప్టెంబర్ 17, ఆదివారం

సెప్టెంబర్ 19, మంగళవారం: గణేష్ చతుర్థి 

నాలుగు రోజుల సెలవు కోసం సెప్టెంబర్ 18, సోమవారం సెలవు తీసుకోండి.

అక్టోబర్ 2023లో లాంగ్ వీకెండ్

1) సెప్టెంబర్ 30, శనివారం

అక్టోబర్ 1, ఆదివారం

అక్టోబర్ 2, సోమవారం: గాంధీ జయంతి

2) అక్టోబర్ 21, శనివారం

అక్టోబర్ 22, ఆదివారం

అక్టోబర్ 24, మంగళవారం: దసరా

అక్టోబర్ 23, సోమవారం రోజు సెలవు తీసుకోండి.

నవంబర్ 2023లో లాంగ్ వీకెండ్

1) నవంబర్ 11, శనివారం

నవంబర్ 12, ఆదివారం: దీపావళి

నవంబర్ 13, సోమవారం: గోవర్ధన్ పూజ (పరిమిత సెలవుదినం)

2) నవంబర్ 25, శనివారం

నవంబర్ 26, ఆదివారం

నవంబర్ 27, సోమవారం: గురునానక్ జయంతి

డిసెంబర్ 2023లో లాంగ్ వీకెండ్

1) డిసెంబర్ 23, శనివారం

డిసెంబర్ 24, ఆదివారం

డిసెంబర్ 25, సోమవారం: క్రిస్మస్

మీరు డిసెంబర్ 22, శుక్రవారం సెలవు పెట్టేస్తే నాలుగు రోజులు టూర్ ప్లాన్ చేయొచ్చు.

WhatsApp channel

టాపిక్