Tata Nexon XM+(S) | నెక్సాన్ SUVలో మరో స్టైలిష్ వేరియంట్ వచ్చేసింది!-tata nexon xm s variant launched know on road price ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tata Nexon Xm+(s) Variant Launched, Know On Road Price

Tata Nexon XM+(S) | నెక్సాన్ SUVలో మరో స్టైలిష్ వేరియంట్ వచ్చేసింది!

HT Telugu Desk HT Telugu
Jul 13, 2022 10:18 PM IST

టాటా మోటార్స్ Tata Nexon XM+(S) వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 9.75 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Tata Nexon XM+(S)
Tata Nexon XM+(S)

టాటా మోటార్స్ తమ Nexon కాంపాక్ట్ SUV లైనప్‌లో సరికొత్త XM+(S) వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 9.75 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. మొత్తం నాలుగు ట్రిమ్‌లలో ఈ SUV అందుబాటులో ఉంటుంది. ఇందులోని చాలా వరకు ఫీచర్లు ఉత్పత్తి నిలిపివేసిన XZ మోడల్ నుంచే తీసుకున్నారు. అయితే అదనంగా మరికొన్ని ఫీచర్లను ఈ సరికొత్త Nexon XM+(S) వేరియంట్‌లో చేర్చారు.

టాటా నెక్సాన్ XM+(S) వాహనం పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్లలో లభిస్తుంది. వాటి ఎక్స్-షోరూమ్ ధరలను పరిశీలిస్తే XM+(S) బేసిక్ మోడల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో వచ్చే పెట్రోల్ వెర్షన్ ధర రూ. 9.75 లక్షలు కాగా, ఇందులోనే ఆటోమేటిక్ వాహనం ధర రూ. 10.40 లక్షలు. అదేవిధంగా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే డీజిల్ వెర్షన్ ధర రూ. 11.05 లక్షలు కాగా, డీజిల్ వెర్షన్లో ఆటోమేటిక్ వాహనం ధర రూ. 11.70 లక్షలుగా ఉంది.

టాటా నెక్సాన్ XM+(S) ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

టాటా నెక్సాన్ వాహనంలో ఇప్పటికే అందించే ఫీచర్లకు అదనంగా Nexon XM+(S)లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 4 స్పీకర్ సిస్టమ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్‌, 7.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-డ్రైవ్ మోడ్‌లు, వెనుకవైపు AC వెంట్‌లు, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు,12 V పవర్ సాకెట్, షార్క్ ఫిన్ యాంటెన్నా అందిస్తున్నారు.

పెట్రోల్ వాహనంలో 1.2-లీటర్ కెపాసిటీ కలిగిన టర్బోచార్జ్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 118 hp పవర్, 170 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా డీజిల్ వాహనంలో 1.5-లీటర్ కెపాసిటీ కలిగిన టర్బోచార్జ్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 108 hp పవర్, 260 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.

ఈ కొత్త వేరియంట్ కాల్గరీ వైట్, డేటోనా గ్రే, ఫ్లేమ్ రెడ్ , ఫోలేజ్ గ్రీన్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్