Sunday Motivation | హ్యాపీగా ఉండాలంటే నచ్చిన వ్యక్తితో గడపండి..-sunday motivation on stay close to anything that makes you glad you are alive ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sunday Motivation On Stay Close To Anything That Makes You Glad You Are Alive

Sunday Motivation | హ్యాపీగా ఉండాలంటే నచ్చిన వ్యక్తితో గడపండి..

HT Telugu Desk HT Telugu
Apr 24, 2022 06:51 AM IST

ఉన్నది ఒకటే జిందగీ. ఇప్పటికే రోజూ చదువు, జాబ్​, ఫ్యామిలీ అంటూ ఒకటా.. రెండా.. ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి. ఈ చిన్ని జీవితంలో మనిషి సంతోషంగా ఉండాలనుకోవడం తప్పేమి కాదు. ప్రతి ఒక్కరికి అవసరం కూడా. కాబట్టి మనం జీవితంలో ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటామో.. వారితో ఉండేందుకు అస్సలు వెనుకాడకండి.

బీ హ్యాపీ.. స్టే హ్యాపీ..
బీ హ్యాపీ.. స్టే హ్యాపీ..

ఆనందం ఉండడం అనేది జీవితంలో అత్యుత్తమమైన వాటిలో ఒకటి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది కోరుకునే అత్యంత ముఖ్యమైన విషయం ఇది. ఎవరైనా తమ జీవితంలో సంతోషంగా ఉంటే చాలు అనుకుంటారు. వారికి ఇంకేమి అవసరం కూడా అనిపించదు. లైఫ్​లో ఎన్ని టెన్షన్​లు ఉన్నా.. ఒకరితో మాట్లాడినా, లేదా వారితో సమయం గడిపినా.. మనసుకు హాయిగా ఉంటుంది. కాబట్టి అలాంటి వారు మీ లైఫ్​లో ఉంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదులుకోకండి.

బతుకుదెరువు కోసం రోజూ కష్టపడుతున్నాం. ఈ తరుణంలో మనకంటూ కొంత సమయం, అందులోనూ మనకు సంతోషాన్నిచ్చే వ్యక్తితో గడపడం అనేది చాలా ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి మీ ఒత్తిడి ఉఫ్ అని ఎగిరిపోవాలంటే.. మీ ప్రియమైన వ్యక్తితో కాస్త సమయం వెచ్చించండి. ఎవరో ఏదో అనుకుంటారని.. ఏవో నిబంధనలు ఆగిపోకండి. ఎందుకంటే.. అవేమి మీకు సంతోషాన్ని ఇవ్వవు. పైగా వాటికోసం సంతోషంగా ఉన్నట్లు నటించాల్సి ఉంటుంది. అది ఇంకా కష్టం కాబట్టి.. నచ్చిన వ్యక్తితో సమయం వెచ్చించేందుకు అబద్ధమాడో, లేక ఇంకేదైనా చేసో.. వెళ్లి గడపండి. మీ ఒత్తిడిని తగ్గించుకుని, సంతోషంగా ఉండడానికి ఏమి చేసినా పర్లేదు. సో బీ హ్యాపీ, స్టే హ్యాపీ.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్