Lemon Water : మీరు ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగుతున్నాారా? అయితే జాగ్రత్త-side effects of lemon water you will be shock with these facts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lemon Water : మీరు ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగుతున్నాారా? అయితే జాగ్రత్త

Lemon Water : మీరు ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగుతున్నాారా? అయితే జాగ్రత్త

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 23, 2022 01:36 PM IST

Lemon Water Side Effects: నిమ్మరసం బరువు తగ్గడానికి గ్రేట్​గా పనిచేస్తుంది. అందుకే దీనిని తాగేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ కొందరికి ఈ నిమ్మకాయ నీరు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. నిమ్మకాయ నీరు ఎవరు తాగకూడదు. ఈ నీటిని తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే..

నిమ్మరసం తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్
నిమ్మరసం తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్

Lemon Water Side Effects : బరువు తగ్గడానికి, ఇతర ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలామంది నిమ్మకాయ నీళ్లు తాగుతారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకుంటారు. ఇది బరువును తగ్గిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాకుండా శరీరానికి అనేక ప్రయోజనాలు ఇస్తుంది. అందుకే ఈ నీటిని చాలామంది తాగుతారు. అయితే ఈ నీటిని తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్​ కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. మరీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఎలాంటి వారు ఈ నీటిని తాగకూడదు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నిర్జలీకరణం

ఎక్కువగా నిమ్మరసం తాగినప్పుడు.. మనకు తరచుగా మూత్రవిసర్జన అవుతుంది. దీని కారణంగా శరీరం డీహైడ్రేషన్​కు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది.

టాన్సిల్ సమస్యలు

అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం.. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల గొంతు నొప్పి వస్తుంది. అంతే కాదు.. పుల్లని పదార్ధాలు లేదా పండు ఎక్కువగా తినడం వల్ల గొంతు నొప్పి, టాన్సిల్ సమస్యలు వస్తాయని వెల్లడించింది.

కడుపు నొప్పి

నిమ్మకాయ నీరు కడుపునకు మేలు చేస్తుందని అంటారు. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు వస్తాయి. ఇది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GIRD), యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. నిమ్మకాయలు వంటి ఆమ్ల ఆహారాల ద్వారా ఇవి తీవ్రతరం అవుతాయి. వాంతులు కూడా జరగవచ్చు.

మైగ్రేన్

మైగ్రేన్ సమస్యలకు, సిట్రస్ పండ్ల మధ్య లింక్ ఉంది. నిమ్మకాయల్లో టైరమైన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తరచుగా తలనొప్పికి కారణమయ్యే సహజ మోనోఅమైన్. ఫలితంగా నిమ్మకాయ నీరు ఎక్కువగా తాగడం వల్ల మైగ్రేన్ నొప్పి పెరుగుతుంది.

కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం

నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్‌తో పాటు ఆక్సలేట్‌లు ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

దంతాలకు హానికరం

అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం.. నిమ్మకాయలు చాలా ఆమ్లంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ దంతాల ఎనామిల్ నాశనం అవుతుంది. నిమ్మరసం లేదా అలాంటిదేదైనా తిన్న వెంటనే నీటిని తాగండి.

ఎసిడిటీ సమస్య

నిమ్మకాయల్లో చాలా యాసిడ్ ఉంటుంది. నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. ఇది ఎసిడిటీ సమస్యలకు దారితీస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్