Royal Enfield Super Meteor 650 : ఎన్​ఫీల్డ్ లవర్స్​కు శుభవార్త.. రయ్​మంటూ వచ్చేస్తున్న మరో బైక్-royal enfield super meteor 650 launch in india mostly in november ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Royal Enfield Super Meteor 650 : ఎన్​ఫీల్డ్ లవర్స్​కు శుభవార్త.. రయ్​మంటూ వచ్చేస్తున్న మరో బైక్

Royal Enfield Super Meteor 650 : ఎన్​ఫీల్డ్ లవర్స్​కు శుభవార్త.. రయ్​మంటూ వచ్చేస్తున్న మరో బైక్

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 02, 2022 01:12 PM IST

రాయల్ ఎన్​ఫీల్డ్​ నుంచి కొత్త బైక్​ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. రాయల్ ఎన్​ఫీల్డ్ ​నుంచి మరికొన్ని రోజుల్లో Super Meteor 650 వచ్చేస్తుంది. మరి ఇది ఎప్పుడు విడుదల కానుంది.. బైక్ ఫీచర్లు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Royal Enfield Super Meteor 650
Royal Enfield Super Meteor 650

Royal Enfield Super Meteor 650 : రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చే ప్రతి బైక్ ఎంత ప్రాచుర్యం పొందుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కంపెనీ ఎప్పుడెప్పుడూ కొత్త బైక్​లను విడుదల చేస్తుందా అని ఎదురు చూస్తారు బైక్ లవర్స్. అయితే అలాంటి వారికి శుభవార్త చెప్తూ.. కంపెనీ తన కొత్త మోడల్ Royal Enfield Super Meteor 650ను విడుదల చేసే యోచనలో ఉంది. ఇది స్పోర్టీ, శక్తివంతమైనదని కంపెనీ నిర్వాహకులు చెప్తున్నారు. Royal Enfield Super Meteor 650 బైక్ ప్రియుల మీటర్‌ను కచ్చితంగా పెంచుతుందని వ్యక్తం చేశారు.

<p>రాయల్ ఎన్‌ఫీల్డ్</p>
రాయల్ ఎన్‌ఫీల్డ్

లీకైన ఫోటోల ప్రకారం Royal Enfield Super Meteor 650 బాడీలో అత్యంత సాంకేతికత, మునుపటి కంటే మరింత శక్తివంతమైన, స్మార్ట్, అందంగా కనిపిస్తుంది. ఈ బుల్లెట్ ఇండియాలో ఇప్పటికే చాలాసార్లు టెస్ట్ రైడ్‌లలో కనిపించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటియోర్ 650 క్రూయిజర్ బుల్లెట్ ఇప్పుడు ప్రొడక్షన్ రెడీ అవతార్‌లో మళ్లీ రోడ్‌పైకి వచ్చింది. ప్రస్తుతం దానికి చెందిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి బుల్లెట్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బుల్లెట్ సాంకేతిక అంశాలను తనిఖీ చేయడానికి కంపెనీ టెస్ట్ రైడ్ చేస్తోంది.

<p>Royal Enfield Super Meteor 650</p>
Royal Enfield Super Meteor 650

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ 650cc బుల్లెట్‌లో ట్విన్ ఎగ్జాస్ట్, రౌండ్ ఇండికేటర్, USD ఫోర్క్, బ్యాక్‌రెస్ట్, గ్లోసీ బ్లాక్ బాడీ డిజైన్, స్ప్లిట్ సీట్, పొడవాటి పారదర్శక విండ్ స్క్రీన్‌లు ఉంటాయి. లెగ్‌గార్డ్, విండ్ స్క్రీన్, బ్యాక్ రెస్ట్ మొదలైనవి ప్రత్యేక ఉపకరణాలుగా అందించే అవకాశముంది.

Royal Enfield Super Meteor 650ను నవంబర్ నెలలో లాంఛ్ చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని ధర సుమారు మూడున్నర లక్షల రూపాయలు. Royal Enfield Super Meteor 650 బుల్లెట్ భారతదేశంలోనే కాకుండా గ్లోబల్ మార్కెట్‌లో కూడా విడుదల చేస్తారని భావిస్తున్నారు. సూపర్ మీటర్ 650 క్రషర్ బుల్లెట్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. నవంబరులోగా లాంచ్ చేయకుంటే.. ఏడాది చివరికల్లా లేదా వచ్చే ఏడాది మొదట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

Royal Enfield Super Meteor 650లో 648n cc ఫ్యూయల్ ఇంజెక్ట్, 4 స్ట్రోక్, సమాంతర ట్విన్ ఇంజన్, ఎయిర్ ఆయిల్ కూల్డ్ సిస్టమ్ ఉంటుంది. ఇది గరిష్టంగా 47 బిహెచ్‌పి పవర్, 52 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. అదనంగా ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ గేర్‌బాక్స్ స్లిప్, అసిస్ట్ క్లచ్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. దీనితో పాటు, ఇది వైబ్రేషన్-రహిత, రిలాక్స్డ్ రైడ్‌ను అందిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్