ఆకర్షణీయమైన 'పేపర్' డిజైన్‌తో Realme GT 2 స్మార్ట్‌ఫోన్‌-realme gt2 smartphone launched in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Realme Gt2 Smartphone Launched In India

ఆకర్షణీయమైన 'పేపర్' డిజైన్‌తో Realme GT 2 స్మార్ట్‌ఫోన్‌

HT Telugu Desk HT Telugu
Apr 24, 2022 01:43 PM IST

Realme GT 2 స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదలయింది. దీని ఫీచర్లు, ధరలు, డిస్కౌంట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి…

Realme GT2 Smartphone
Realme GT2 Smartphone

Realme ఈ నెల ప్రారంభంలో తమ బ్రాండ్ నుంచి GT 2 ప్రోని భారత మార్కెట్లో ఇప్పుడు అంతకంటే తక్కువ ధరతో వెనీలా GT 2ని విడుదల చేసింది. ఈ ఫోన్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది పేపర్-ఇన్‌స్పైర్డ్ డిజైన్‌తో వచ్చింది. అంటే దీని బ్యాక్ ప్యానెల్ పేపర్ అనుభూతిని కలిగిస్తుంది. ప్యానెల్‌పై పెన్సిల్‌తో డూడుల్ కూడా చేయవచ్చు. 

Realme వెనీలా GT 2 స్టీల్ బ్లాక్, పేపర్ వైట్ అలాగే పేపర్ గ్రీన్ అనే మూడు కలర్ ఛాయిస్ లలో లభిస్తుంది. ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా ఈ ఫోన్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఇంకా Realme GT 2లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత? మొదలగు వివరాలు ఇక్కడ చూడండి.

Realme GT 2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.62 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే

8/12 GB RAM, 128/256 GB స్టోరేజ్ సామర్థ్యం

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్

వెనకవైపు 50MP సోనీ OIS ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ షూటర్, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 65W ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ

8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.34,999/- కాగా, 12 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.38,999/- గా నిర్ణయించారు

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్ 28 నుంచి Realme అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. HDFC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి 8GB వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ. 5 వేలు డిస్కౌంట్ లభిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్