Oppo A77 | మెరుగైన ఫీచర్లు, సరసమైన ధరలో వచ్చిన ఒప్పో స్మార్ట్‌ఫోన్‌!-oppo a77 smartphone launched in india check price details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Oppo A77 Smartphone Launched In India, Check Price Details

Oppo A77 | మెరుగైన ఫీచర్లు, సరసమైన ధరలో వచ్చిన ఒప్పో స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu
Aug 01, 2022 01:40 PM IST

భారత మార్కెట్లో OPPO A77 పేరుతో మరొక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి, ధర అందుబాటులోనే ఉంది. పూర్తి వివరాలు చూడండి.

OPPO A77
OPPO A77

స్మార్ట్‌ఫోన్‌ మేకర్ ఒప్పో తమ A సిరీస్‌ను విస్తరిస్తూ జాబితాలో మరొక ఫోన్‌ను చేర్చింది. తాజాగా OPPO A77 పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది సరసమైన ధరలోనే లభించే 5G సపోర్ట్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌. ఇందులో 720x1612 పిక్సెల్ రిజల్యూషన్‌తో HD+ డిస్‌ప్లే, MediaTek ప్రాసెసర్‌, సరికొత్త ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ 5GB వర్చువల్ ర్యామ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా ర్యామ్ సామర్థ్యాన్ని 8-12GB వరకు విస్తరించుకోవచ్చు. అలాగే మైక్రో SD కార్డ్‌ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా స్టోరేజ్ మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాదు వాటర్ రెసిస్టెంట్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ IPX4 రేటింగ్‌ను కలిగి ఉంది.

ఇంకా OPPO A77లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత? మొదలగు వివరాల కోసం కింది వరకు చూడండి.

OPPO A77 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.56 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
  • 4+GB RAM, 128+GB స్టోరేజ్ సామర్థ్యం
  • Mediatek డైమెన్సిటీ 810 ప్రాసెసర్
  • వెనకవైపు 48 MP + 2MP డ్యుఎల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W Supervooc ఛార్జర్
  • ధర, రూ. 15,499/-

కనెక్టివిటీ పరంగా డ్యూయల్-సిమ్ కార్డ్ స్లాట్, 5G, డ్యూయల్-బ్యాండ్ WiFi, బ్లూటూత్, USB టైప్-C పోర్ట్‌, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దేశంలోని అన్ని రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్