Vaishnodevi: నవరాత్రుల స్పెషల్.. తక్కువ ధరకే IRCTC వైష్ణో దేవీ ఆలయ ప్యాకేజీలు!
Vaishnodevi IRCTC Packages: నవరాత్రుల్లో మీరు వైష్ణోదేవిని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే , IRCTC మీ కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తుంది. జమ్మూలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయ సందర్శనార్ధం IRCTC పలు ప్యాకేజీలను తీసుకొచ్చింది. IRCTC ఈ టూర్ ప్యాకేజీ ద్వారా మీరు తక్కువ బడ్జెట్‌లో మొత్తం కుటుంబంతో వైష్ణోదేవిని దర్శించుకోవచ్చు
నవరాత్రులు సెప్టెంబర్ 26 నుండి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ పర్వదినాన చాలా మంది భక్తులు వైష్ణో దేవిని దర్శించుకోవాలనుకుంటారు. వైష్ణో దేవి ఆశీర్వాదం కోసం సూదూర ప్రాంతాల నుండి భక్తులు వెళుతుంటారు. ఈ నవరాత్రుల్లో మీరు కూడా వైష్ణోదేవిని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే , IRCTC మీ కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తుంది. జమ్మూలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయ సందర్శనార్ధం IRCTC పలు ప్యాకేజీలను తీసుకొచ్చింది. IRCTC ఈ టూర్ ప్యాకేజీ ద్వారా మీరు తక్కువ బడ్జెట్‌లో మొత్తం కుటుంబంతో వైష్ణోదేవిని దర్శించుకోవచ్చు. IRCTC అందిస్తున్న ఈ ప్యాకేజీలోని వివరణాత్మక సమాచారాన్ని తెలుసుకుందాం
ట్రెండింగ్ వార్తలు
వైష్ణో దేవి ఆలయానికి ఈ ప్రయాణం నవీ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీ నుండి శ్రీ శక్తి ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 22461 కత్రాకు బయలుదేరుతుంది. రాత్రిపూట ప్రయాణం ఉంటుంది. ప్రయాణికులు మరుసటి రోజు కత్రా స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి IRCTC గెస్ట్‌హౌజ్‌లో అతిథ్యం ఇస్తారు. ఇక్కడ AC డార్మిటరీతో పాటు బెడ్, లాకర్ ఫెసిలిటీ ఉంటుంది.
ఈ అతిథి గృహంలోనే ప్రయాణికులకు అల్ఫాహారం కూడా అందిస్తారు. తర్వాత బాణగంగలో దింపనున్నారు. అక్కడి నుండి మాతా వైష్ణో దేవి దగ్గరకు ప్రయాణీకులు వారి స్వంత ప్రయాణాన్ని నిర్ణయించుకోవాలి. దర్శనం తర్వాత తిరిగి బాన్‌గంగా చేరుకున్నాక వారిని అక్కడ నుండి పికప్ చేసుకొని సాయంత్రానికి గెస్ట్‌హౌజ్‌కు తీసుకవస్తారు. సాయంత్రం విశ్రాంతి రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ కాట్రా రైల్వే స్టేషన్ దింపుతారు. 11 గంటలకు ట్రైన్ ఎక్కి తిరుగు దిల్లీకి చేరుకుంటారు. దీంతో ఈ ప్యాకేజీ ముగుస్తుంది.
మరో ప్యాకేజీని చూస్తే.. ఉత్తర్ సంపర్క్ క్రాంతి ద్వారా వైష్ణోదేవీ దర్శనాన్ని అందిస్తున్నారు. ఇది రెండు రోజులు, రెండు రాత్రులు ఉంటుంది. ఈ ప్యాకెజ్ విషయానికి వస్తే..
ఒక్కరికి రూ.5,330
ఇద్దరికి 3,240..
ముగ్గురికి 2,845
5 -11 ఏళ్ల పిల్లలకైతే రూ.1,835
సంబంధిత కథనం
Cancel Tejashwi bail in IRCTC scam: ‘తేజస్వీ మా అధికారులను బెదిరించారు’
September 17 2022
Dasara holidays 2022 Telangana: 26 నుంచి అక్టోబర్ 8 వరకు దసరా సెలవులు..
September 13 2022