National Girl Child Day 2023 : బాలికల హక్కులు, లక్ష్యాలు ఏమిటో తెలుసా?-national girl child day 2023 special story on rights of a girl and objectives and history of the day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  National Girl Child Day 2023 Special Story On Rights Of A Girl And Objectives And History Of The Day

National Girl Child Day 2023 : బాలికల హక్కులు, లక్ష్యాలు ఏమిటో తెలుసా?

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 24, 2023 10:42 AM IST

National Girl Child Day 2023 : బాలికల హక్కుల గురించి అవగాహన కల్పిస్తూ.. వారి జీవితాల్లో వారు ఎదుర్కొంటున్న అసమానతలను ఎత్తిచూపడానికి జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం జరుపుతున్నారు. అసలు ఈరోజు వెనుక ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జాతీయ బాలికా దినోత్సవం 2023
జాతీయ బాలికా దినోత్సవం 2023

National Girl Child Day 2023 : దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతల గురించి అవగాహన కల్పిస్తూ.. ఆడపిల్లల హక్కులు, స్త్రీ విద్య, ఆరోగ్యం, పోషకాహారం గురించి అవగాహన కల్పిస్తూ.. ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవం చేస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లను రక్షించాలి అనే వివిధ ప్రచారాలు, కార్యక్రమాలను నిర్వహిస్తారు.

దీని వెనుక ఉన్న లక్ష్యం భారతదేశంలోని బాలికలకు మద్దతునిస్తూ.. అవకాశాలను అందించడమే. భారతదేశంలో లింగ అసమానత అనేది దృష్టి సారించాల్సిన ప్రధాన సమస్యలలో ఒకటి. ఇది చట్టపరమైన హక్కులు, విద్య, వైద్య సంరక్షణ, వివాహం మొదలైన అనేక రంగాలలో ఉంది. ఆడపిల్లల భ్రూణహత్యలు మరొక ప్రధాన సమస్య. వీటిని పారద్రోలుతూ.. చిన్నతనంలో బాలికల ప్రాముఖ్యతను గుర్తించాలని దీనిని నిర్వహిస్తున్నారు.

జాతీయ బాలికా దినోత్సవం 2023 చరిత్ర

జాతీయ బాలికా దినోత్సవాన్ని తొలిసారిగా 2008లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అసమానతలను ఎత్తిచూపడం, ఆడపిల్లల హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహార ప్రాముఖ్యతతో సహా అవగాహనను ప్రోత్సహించడం దీని వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. ఈ రోజుల్లో కూడా లింగ వివక్ష అనేది బాలికలు మరియు మహిళలు వారి జీవితాంతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా మారింది.

జాతీయ బాలికా దినోత్సవం 2023 లక్ష్యాలు

* ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించడంతోపాటు సమాజంలో ఆడపిల్లలకు కొత్త అవకాశాలు కల్పించడం.

* ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అన్ని అసమానతలను తొలగించడం.

* దేశంలో ఆడపిల్లలు వారి హక్కులు, గౌరవం, విలువను పొందేలా చేయడం.

* లింగ వివక్షపై పని చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం.

* భారతదేశంలో క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తికి వ్యతిరేకంగా పని చేయడం, ఆడపిల్లలను భారంగా భావించే ప్రజల ఆలోచనలను మార్చడం.

* ఆడపిల్ల ప్రాముఖ్యత, పాత్ర గురించి అవగాహన పెంచడం.

* బాలికలకు అవకాశాలు కల్పిస్తూ.. వారి అభ్యున్నతి కోసం హక్కులను కల్పించడం.

* ఆడపిల్లల ఆరోగ్యం, పోషణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం.

* సమాన హక్కులు కల్పించడంతోపాటు దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు వీలు కల్పించడం.

భారతదేశంలో ఆడపిల్లల హక్కులు

ఆడపిల్లల జీవన స్థితిని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం వివిధ పథకాలను ప్రస్తావించింది. ఆ పథకాలు ఏమిటో.. ఆడపిల్లలకు ప్రభుత్వం కల్పిస్తున్న హక్కులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

* గర్భధారణ సమయంలో క్లినిక్‌లలో లింగ నిర్ధారణను ప్రభుత్వం నిరోధించింది.

* ప్రస్తుతం ఆడపిల్లల బాల్య వివాహాలపై ఆంక్షలు ఉన్నాయి.

* ఆడపిల్లలను కాపాడేందుకు ప్రభుత్వం ‘సేవ్‌ ద గర్‌ చైల్డ్‌’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.

* 14 సంవత్సరాల వరకు బాలబాలికలకు ఉచిత, నిర్బంధ విద్యను అందిస్తూ బాలికల విద్యను మెరుగుపరిచింది.

* సమాజంలో పోషకాహార లోపం, అధిక నిరక్షరాస్యత, పేదరికం, శిశు మరణాలపై పోరాడేందుకు.. గర్భిణీ స్త్రీలందరికీ ప్రసవానంతర సంరక్షణ కల్పిస్తుంది.

* మహిళలకు ఉపాధి, హోదా కల్పించేందుకు సతీ వ్యతిరేక, MTP వ్యతిరేక వంటి అనేక చట్టాలను ప్రభుత్వం రూపొందించింది.

* బాలికలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం అనేక నియమాలను రూపొందించి భవిష్యత్తును మెరుగుపరుస్తుంది.

* భారతదేశంలోని వెనుకబడిన రాష్ట్రాల విద్యా స్థితిని చూసేందుకు ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలను రూపొందించింది.

* ప్రభుత్వం బాలికల కోసం 'ఆపరేషన్ బ్లాక్‌బోర్డ్' రూపొందించింది. దీని ద్వారా ప్రతి ఉపాధ్యాయుడు ఉన్నత విద్యను పొందడం ద్వారా విద్యార్థులను విద్యలో మెరుగ్గా తీర్చిదిద్దడం.

* శిశువుల సంరక్షణ కోసం అనేక బాల్వాడి క్రెచ్‌లను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. వారిని ప్రాథమిక పాఠశాలలను సందర్శించేలా చేసింది.

* గ్రామీణ బాలికలకు జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం SHG లేదా స్వయం సహాయక బృందాలను ప్రవేశపెట్టింది.

* వెనుకబడిన తరగతుల బాలికలకు సులువుగా ఉండేందుకు ఓపెన్ లెర్నింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్