Miracle Tea | ఇది టీ కాదు అమృతం.. తాగితే అనేక అనారోగ్యాలను నివారించవచ్చు!-miracle tea makes wonders for your health know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Miracle Tea | ఇది టీ కాదు అమృతం.. తాగితే అనేక అనారోగ్యాలను నివారించవచ్చు!

Miracle Tea | ఇది టీ కాదు అమృతం.. తాగితే అనేక అనారోగ్యాలను నివారించవచ్చు!

HT Telugu Desk HT Telugu
May 10, 2022 05:10 PM IST

అద్భుతమైన ఆయుర్వేద ప్రయోజనాలు కావాలంటే మిరాకిల్ టీ తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అసలు మిరాకిల్ టీ అంటే ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ రెసిపీ చూడండి..

Ayurvedic Tea
Ayurvedic Tea (Pixabay)

వేసవి కాలంలో వేడి వేడి ఆహార పదార్థాలపై ఆసక్తి ఉండదు. అయితే వేడి వేడి ఛాయ్ మన జీవనశైలిలో ఒక భాగం. ఏ కాలంలోనైనా టీ తాగకుండా ఉండలేం. కానీ వేడి వాతావరణం కారణంగా చాలా మందికి వికారం, తలనొప్పి, పొత్తికడుపులో నొప్పి, అలసట, డీహైడ్రేషన్ తదితర సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమయంలో సాధారణ టీ, కాఫీలు తీసుకుంటే ఈ ఎండాకాలంలో సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. గొప్ప విషయం ఏమిటంటే ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపే అద్భుతమైన చిట్కాలు, ఆరోగ్యకరమైన పానీయాలు ఉన్నాయి.

ఈ సీజన్‌లో మీరూ అలాంటి ఆరోగ్యకరమైన పానీయాల గురించి తెలుసుకోవాలని భావిస్తే మీకు 'మిరాకిల్ టీ' అనే ఒక మంచి ఆప్షన్ ఉంది. పేరుకు తగ్గటే ఈ మిరాకిల్ టీ వేసవి సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

ఈ మిరాకిల్ టీని ఎలా తయారు చేసుకోవాలి, అందుకు ఏమేమి కావాలో ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దీక్ష వివరించారు. మీరూ ఈ మిరాకిల్ టీని తాగుతూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందండి..

రెసిపీ ఇదీ

  • ఒక పాత్రలో ఒక గ్లాసు నీటిని తీసుకుని మరిగించాలి.
  • మరుగుతున్న నీటిలో చిన్నని మంట మీద 5-7 పుదీనా ఆకులు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి.
  • ఇలా 5 నిమిషాల పాటు ఉడకబెట్టిన తర్వాత నీటిని వడకట్టి ఒక కప్ లోకి తీసుకోవాలి. ఇదే మిరాకిల్ టీ!
  • గోరువెచ్చగా ఉన్నపుడు ఈ టీని సిప్ చేస్తూ ఉండండి.

ఆరోగ్య ప్రయోజనాలు

  • మంచి వాసన, ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. ఈ మిరాకిల్ టీ తాగితే జలుబు, దగ్గు, ఆసిడిటీ, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, తలనొప్పి, శరీరంలోని మలినాలు, మొటిమలు, సైనసిటిస్, మలబద్ధకం మొదలగు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.
  • ఉదయం లేవగానే ఈ మిరాకిల్ టీ ఒక కప్పు తాగాలి. అలాగే ఆహారం తినడానికి అరగంట ముందు లేదా అరగంట తర్వాత తీసుకుంటే ఎలాంటి జీర్ణసమస్యలు, మలబద్ధకం సమస్యలు ఉండవు.
  • ఇది సహజమైన ఆంటాసిడ్ ద్రావణంలా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు.
  • ఈ టీని కుటుంబంలో అన్ని వయసుల వారు తీసుకోవచ్చు. ఎలాంటి సీజన్‌లో అయినా తాగవచ్చు.
  • మైగ్రేన్, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, థైరాయిడ్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, హార్మోన్ అసమతుల్యత, మలబద్ధకం మొదలైన వాటితో బాధపడేవారికి ఈ మిరాకిల్ టీ అద్భుతంగా పనిచేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్