Makar Sankranti 2023 : మీ ప్రియమైన వారికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..-makar sankranti 2023 quotes and wishes what s app and face book messages to wished your loved one ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Makar Sankranti 2023 Quotes And Wishes What's App And Face Book Messages To Wished Your Loved One

Makar Sankranti 2023 : మీ ప్రియమైన వారికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 14, 2023 03:03 PM IST

Makar Sankranti 2023 Wishes : కొత్త పంటకు స్వాగతం చెప్తూ.. శీతాకాలం ముగింపునకు ప్రతీకగా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ పండుగకు మీ ప్రియమైన వారికి సంక్రాంతి శుభాకాంక్షలు, కోట్స్ చెప్పాలనుకుంటే ఇది మీకోసమే..

మకర సంక్రాంతి 2023
మకర సంక్రాంతి 2023

Makar Sankranti 2023 : దేశంలో అత్యంత విస్తృతంగా జరుపుకునే పవిత్రమైన హిందూ పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోని ప్రజలు భూమాతకు గౌరవం ఇస్తూ.. శీతాకాలం ముగింపును జరుపుకోవడానికి సంక్రాంతి చేసుకుంటారు. ఇది వేసవి కాలానికి ప్రారంభంగా ఉంటుంది. అందుకే రైతులు కొత్తపంటలు వేయడం ప్రారంభింస్తారు. మకర సంక్రాంతి పండుగను మంచి పంట కోసం సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుతూ.. సీజన్‌లో మార్పునకు గుర్తుగా చేస్తారు.

కొత్త దుస్తులు ధరించి.. పిండి వంటలు చేసుకుంటూ బంధు మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. అయితే పండుగ సమయంలో మీకు దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులకు సోషల్ మీడియా.. వాట్సప్, ఫేస్ బుక్ వేదికగా విషెస్ చెప్పాలి అనుకుంటే.. ఇక్కడ కొన్ని కోట్స్, సందేశాలు ఉన్నాయి. అవేంటంటే..

* మకర సంక్రాంతి శుభాకాంక్షలు!

* ఈ సంవత్సరం మకర సంక్రాంతి మీ జీవితంలో మంచి సమయాలకు నాంది పలకాలని ఆశిస్తున్నాను.

* ఈ పవిత్రమైన మకర సంక్రాంతి రోజున మీ కోరికలన్నీ నెరవేరాలని ఆశిస్తున్నాను.

* ఈ సంక్రాంతి నుంచి.. మీరు కూడా కొత్త ఎత్తులకు చేరుకోవాలని.. అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను. మకర సంక్రాంతి శుభాకాంక్షలు!

* మకర సంక్రాంతి మీకు జ్ఞానం, ఆనందాన్ని, ధనాన్ని మీకు అందిస్తుంది.

* ఈ సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన మకర సంక్రాంతి సందర్భంగా మీకు, మీ ప్రియమైన వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

* మకర సంక్రాంతి పండుగ మీకు, మీ కుటుంబానికి సంతోషాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను.

* ఇది కొత్త ప్రారంభానికి, కొత్త గమ్యాన్ని సెట్ చేయడానికి సరైన సమయం. మకర సంక్రాంతి సందర్భం మీకు పూర్తి ఆనందం కలగాలని కోరుకుంటున్నాను.

* మీకు, మీ ప్రియమైన వారికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు!

WhatsApp channel

సంబంధిత కథనం