ఆటోఫోకస్ సెల్ఫీ ఫీచర్‌తో Vivo Y75 స్మార్ట్‌ఫోన్ విడుదల!-know vivo y75 smartphone price and features ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know Vivo Y75 Smartphone Price And Features

ఆటోఫోకస్ సెల్ఫీ ఫీచర్‌తో Vivo Y75 స్మార్ట్‌ఫోన్ విడుదల!

HT Telugu Desk HT Telugu
May 23, 2022 11:26 AM IST

వివో నుంచి Vivo Y75 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో విడుదల అయింది. ఇది 4G మొబైల్. ఇందులో సెల్ఫీ కెమెరా ప్రధాన ఆకర్షణ. మిగతా వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Vivo Y75
Vivo Y75 (Vivo India)

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నుంచి Y-సిరీస్‌లో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y75  భారత మార్కెట్లో విడుదల అయింది.  ఇది 4G మొబైల్.  ఇదే మోడెల్‌లో 5G వెర్షన్ ఫోన్‌ను కూడా వివో గతంలో ప్రకటించింది. 

తాజాగా విడుదలైన Vivo Y75లో ప్రీమియం ఫీచర్లు  ఉన్నాయి. ఇందులో భాగంగా 44-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. అలాగే వేగవంతమైన ఛార్జింగ్ కోసం 44W ఫ్లాష్ ఛార్జ్ బ్యాటరీ టెక్నాలజీతో వస్తుంది.  

ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Vivo Y75 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.44 అంగుళాల AMOLED డిస్‌ప్లే
  • 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ Helio G96 ప్రాసెసర్
  • వెనకవైపు 50+8+2 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 44 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4050 mAh బ్యాటరీ సామర్థ్యం, 44W ఛార్జర్
  •  ధర, రూ. 20,999/-

కనెక్టివిటీ పరంగా చూస్తే Vivo Y75లో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ v5.2, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C పోర్ట్. అలాగే ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్ ఉన్నాయి.

డ్యాన్సింగ్ వేవ్స్ , మూన్‌లైట్ షాడో కలర్ రెండు అనే షేడ్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. Vivo Y75 స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్, వివో ఇ-స్టోర్ సహా ఇతర అన్ని ముఖ్యమైన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్