Infinix Note 12 Pro 4G । దృఢమైన ఫీచర్లతో ఇన్ఫినిక్స్ నుంచి మరో 4G స్మార్ట్‌ఫోన్‌-infinix note 12 pro 4g smartphone launched check price and discount offers ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Infinix Note 12 Pro 4g Smartphone Launched Check Price And Discount Offers

Infinix Note 12 Pro 4G । దృఢమైన ఫీచర్లతో ఇన్ఫినిక్స్ నుంచి మరో 4G స్మార్ట్‌ఫోన్‌

HT Telugu Desk HT Telugu
Aug 28, 2022 11:07 AM IST

ఇన్ఫినిక్స్ కంపెనీ Infinix Note 12 Pro 4G స్మార్ట్‌ఫోన్‌ ను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. లాంచ్ ఆఫర్లలో భాగంగా డిస్కౌంట్ కూడా ఉంది. మరి ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Infinix Note 12 Pro 4G
Infinix Note 12 Pro 4G

స్మార్ట్‌ఫోన్ తయారీదారు Infinix భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ Infinix Note 12 Proని విడుదల చేసింది. గతంలో ఇదే పేరుతో 5G ఫోన్ విడుదలైంది, కాగా ఇది బ్రాండ్ నుంచి విడుదలైన 4G వెర్షన్ స్మార్ట్‌ఫోన్. అయితే ఇన్ఫినిక్స్ ఇందులోనూ మెరుగైన ఫీచర్లే అందిస్తోంది. ఇందులో భాగంగా ట్రిపుల్ కెమెరా సెటప్, డ్యుఎల్ LED ఫ్లాష్ తో ఫ్రంట్ క్యామ్, ఫాస్ట్ ఛార్జింగ్ కలిగిన దృఢమైన బ్యాటరీ ఉన్నాయి.

సరికొత్త Infinix Note 12 Pro ఏకైక 256GB స్టోరేజ్ వేరియంట్‌లో వచ్చింది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని 2TB వరకు విస్తరించుకోవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ ఆల్పైన్ వైట్, టుస్కానీ బ్లూ, వోల్కానిక్ గ్రే కలర్ ఆప్షన్‌లలో మూడు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. సెప్టెంబర్ 1 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

అయితే Infinix Note 12 Pro 4G స్మార్ట్‌ఫోన్ లో ఇంకా ఏమేమి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత, డిస్కౌంట్ ఆఫర్లు మొదలైన వివరాలను ఈ కింద పరిశీలించండి.

Infinix Note 12 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
  • 8 GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్
  • వెనకవైపు 108MP+ 2MP+ AI ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33 W ఛార్జర్

కనెక్టివిటీ పరంగా Infinix Note 12 Proలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.0, NFC, GPS/ A-GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. అలాగే యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్ వంటి సెన్సార్‌లు ఉన్నాయి.

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 4G ఫోన్ ధర రూ. 16,999 కాగా, సేల్స్ ఆఫర్‌లో భాగంగా ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ పై రూ.1,500 తగ్గింపును అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 500 సూపర్ కాయిన్‌లు జత చేసినపుడు Infinix Note 12 Pro 4G స్మార్ట్‌ఫోన్ రూ.14,999కే లభించనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్