Indian Army Recruitment : NCC స్పెషల్ ఎంట్రీ 53వ కోర్సు కోసం దరఖాస్తులకు ఆహ్వానం-indian army recruitment 2022 apply for ncc special entry 53rd course ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Indian Army Recruitment 2022 Apply For Ncc Special Entry 53rd Course

Indian Army Recruitment : NCC స్పెషల్ ఎంట్రీ 53వ కోర్సు కోసం దరఖాస్తులకు ఆహ్వానం

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 19, 2022 09:45 AM IST

Indian Army Recruitment 2022 : NCC స్పెషల్ ఎంట్రీ 53వ కోర్సు కోసం కొత్త ఖాళీలు ప్రకటించారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దీని పేస్కేల్, అర్హత ప్రమాణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022

Indian Army Recruitment 2022 : ఇండియన్ ఆర్మీ NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 53వ కోర్సు ఏప్రిల్ 2023 (55 ఖాళీలు) కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది. అవివాహిత పురుష, స్త్రీ అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2022. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా అప్లై చేయవచ్చు.

Indian Army Recruitment 2022 వివరాలు

పోస్ట్: NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 53వ కోర్సు (ఏప్రిల్ 2023)

ఖాళీల సంఖ్య: 55 (50 మంది పురుషులు, 05 మంది మహిళలు)

పే స్కేల్: లెవల్ 10

Indian Army Recruitment 2022 అర్హత ప్రమాణాలు

అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ పొంది ఉండాలి. లేదా కనీసం 50% మార్కులతో సమానమైన డిగ్రీ ఉండాలి. దరఖాస్తుదారులు NCC ‘C’ సర్టిఫికేట్ కచ్చితంగా కలిగి ఉండాలి.

వయోపరిమితి: 19 నుంచి 25 సంవత్సరాలు

దరఖాస్తు ఎలా చేయాలంటే.. ఆసక్తిగల అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్ www.joinindianarmy.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ ఆర్మీ NCC స్పెషల్ ఎంట్రీ 53వ కోర్సు ఏప్రిల్ 2023: ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ: ఆగస్టు 17, 2022

ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2022

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022 ఎంపిక ప్రక్రియ

షార్ట్‌లిస్టింగ్, SSB ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్