Power Saving Tips: ఈ టిప్స్ పాటిస్తే వేసవిలో మీరు సగం విద్యుత్ ఆదా చేసుకోవచ్చు!-how to reduce power bill energy saving tips for summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Power Saving Tips: ఈ టిప్స్ పాటిస్తే వేసవిలో మీరు సగం విద్యుత్ ఆదా చేసుకోవచ్చు!

Power Saving Tips: ఈ టిప్స్ పాటిస్తే వేసవిలో మీరు సగం విద్యుత్ ఆదా చేసుకోవచ్చు!

HT Telugu Desk HT Telugu
Apr 03, 2022 09:30 PM IST

సాధరణంగా వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఏసీ,ఫ్యాన్,కూలర్స్ ఎక్కువగా వినియోగిస్తారు కాబట్టి విద్యుత్తు బిల్లు మోత మోగుతుంది. అయితే ఈ పరిస్థితిల్లో మీరు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఖచ్చితంగా విద్యుత్ ఆదా చేసి బిల్లును తగ్గించుకోవచ్చు

electricity meter
electricity meter

పెట్రోలు, డీజిల్ , నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు సడుతున్న ప్రజలకు తాజాగా పెంచిన కరెంట్ బిల్లు కూడా అదనపు భారం కానుంది. ముఖ్యంగా వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఏసీ,ఫ్యాన్,కూలర్స్ ఎక్కువ వినియోగిస్తారు కాబట్టి విద్యుత్తు బిల్లు మోత మోగుతుంది.  అయితే ఈ పరిస్థితిల్లో మీరు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఖచ్చితంగా విద్యుత్ ఆదా చేసి బిల్లును తగ్గించుకోవచ్చు. సాధరణంగా వేసవిలో ఇంట్లో ఫ్యాన్, ఫ్రిజ్, ఏసీ, ఎయిర్ కూలర్ వంటి కూల్ అప్లయెన్సెస్ వాడకం పెరుగుతుంది. దీంతో కరెంటు బిల్లు పెరుగుతుంది. కావున వీటి వినియోగంలో కింది టిప్స్ పాటిస్తే కాస్త ఉపశమనం పొందవచ్చు.

  • ముఖ్యంగా ఏసీ ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తోంది. కాబట్టి బిల్లు తడిసి మోపెడు అవుతుంది. మీరు కరెంట్‌ను ఆదా చేయలంటే.. ఏసీని 16కి బదులు 24 డిగ్రీల వద్ద పెడితే మీకు కావాల్సిన కూలింగ్ వస్తుంది. అదే సమయంలో కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది. అలాగే బయట ఉండే AC యూనిట్ ఎప్పుడూ నీడలో ఉండాలి. AC అవుట్‌డోర్‌ యూనిట్‌పై నేరుగా సూర్యకాంతి పడడం వల్ల కొంచెం ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఏసీకి నీడనిచ్చేందుకు చుట్టూ చెట్టు నాటితే నీడ తగిలి కొంత మేలు జరుగుతుంది.
  • మీరు ఆటోమేటిక్ హీట్ కట్-ఆఫ్ ఫీచర్‌తో ఐరన్ బాక్స్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు విద్యుత్ బిల్లులో కొద్దిగా ఆదా చేయవచ్చు. దీని వల్ల ఐరన్ బాక్స్ ఎక్కువగా వేడి అయినప్పుడు ఆటోమేటిక్ ఆగిసోతుంది. దీంతో విద్యుత్ వినియోగం తక్కువ అవుతుంది.
  • రిఫ్రిజిరేటర్‌లో గాలి బాగా ఆడుతుంటే, రిఫ్రిజిరేటర్ త్వరగా చల్లబడుతుంది. దీంతో విద్యుత్ వినియోగం తగ్గుతుంది. కాబట్టి ఫ్రిజ్‌ని బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచండి.
  • మీరు ఇంట్లో వివిధ వాట్స్ కలిగిన బల్బులను ఉపయోగిస్తూ ఉండవచ్చు. అయితే వాటికి బదులుగా ఎల్‌ఈడీ బల్బుల వినియోగిస్తే విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. ఇది ఇతర బల్బుల కంటే ఇది 90 శాతం తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. కాబట్టి ఎల్‌ఈడీ బల్బులను ఉపయోగించండి.
  • తరచుగా మనం టీవీని రిమోట్‌‌లోనే ఆఫ్ చేస్తాము. ఫుల్ ఛార్జ్ అయినప్పటికీ కూడా మొబైల్ ఛార్జర్‌ను ఫోన్‌తో ఉంచుతాము. దీని వల్ల కరెంటు బిల్లు కాస్త పెరిగే అవకాశం ఉంది. అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేస్తే 5 శాతం విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం