కాబోయే పెళ్లి కూతురికి ఫిట్‌నెస్ చిట్కాలు.. -here are some fitness tips pre wedding workout ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Here Are Some Fitness Tips Pre-wedding Workout

కాబోయే పెళ్లి కూతురికి ఫిట్‌నెస్ చిట్కాలు..

HT Telugu Desk HT Telugu
Apr 14, 2022 08:57 AM IST

ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. పెళ్ళి అనగానే ఎవరికైనా మొదట గుర్తోచేది అందంగా కనిపించే అమ్మాయిలే. వివాహ వేడుకకు హాజరయ్యే బంధువులు, స్నేహితులు వేడుకలో అందంగా కనిపించాలని పెళ్ళికి ఐదారు రోజుల ముందు నుండే ప్రయత్నాలు మెుదలు పెడుతారు

Mouni Roy
Mouni Roy

ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. పెళ్ళి అనగానే ఎవరికైనా మొదట గుర్తోచేది అందంగా కనిపించే అమ్మాయిలే. వివాహ వేడుకకు హాజరయ్యే బంధువులు, స్నేహితులు వేడుకలో అందంగా కనిపించాలని పెళ్ళికి ఐదారు రోజుల ముందు నుండే ప్రయత్నాలు మెుదలు పెడుతారు. మరీ వాళ్ళే అలా ఉంటే.. పెళ్ళి కూతుళ్ళ సంగతేంటీ. పెళ్లికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంటుంది. పెళ్ళి హడావుడిలో డైట్,వ్యాయామాన్ని పూర్తిగా పక్కకు పెట్టేస్తారు. దీంతో ముఖంలో కళ తప్పుతుంది. లావుగా అయిపోయి అద్దం ముందు నిలబడి చూసుకుంటూ కాస్త సన్నగా ఉంటే బాగుండేదనిపిస్తోంది. మరీ ఇలాంటి సమయాల్లో మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఎలా ఉంచుకోవడం ఎలానో అర్థం కావడం లేదు కదూ... అయితే పెళ్లికి ముందు మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఇక్కడ కొన్ని ఫిట్‌నెస్ చిట్కాలు ఉన్నాయి.

మీరు చాలా కాలంగా వ్యాయామం పక్కకు పెట్టినందున, తిరిగి ఎక్కడ ప్రారంభించాలో అర్ధం కాదు. అయితే ముందుగా నడకతో ప్రారంభించండి. ఎందుకంటే నడక ఆరోగ్యానికి కీలకం. పెళ్లికి ముందు మిమ్మల్ని మీరు స్లిమ్‌గా, ట్రిమ్‌గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ నడవండి.

ఫిట్‌గా ఉండటానికి, డైట్ అని ఆహారం తినడం మానకండీ. ప్రతిదీ తినండి కానీ అవి తక్కువ పరిమాణంలో ఉండాలి. నీరు పుష్కలంగా త్రాగాలి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది.

అల్పాహారాన్ని ఎప్పుడూ దాటవేయవద్దు. ఉదయం ఎక్కువగా భోజనం తినండి. మధ్యాహ్న సమయంలో తేలికగా భోజనం తీసుకోండి. జంక్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండండి.

తగినంతగా నిద్ర పొండి. అయితే, ఎక్కువగా నిద్రపోవడం మంచిది కాదు. రాత్రికి 8-9 గంటలు లోపు నిద్రపోండి. లేటుగా అంటే 10-12 గంటలు నిద్రపోవడం మంచిది కాదుజ

కేవలం వ్యాయామం కాకుండా, మీ మనస్సును తెలికగా ఉంచుకోవడానికి కామెడీ సినిమాలు రెండు గంటలు చూడండి.

మీ బిజీ షెడ్యూల్‌లో రోజంతా వ్యాయామం చేయడానికి మీకు సమయం లేకపోతే, మీరు వ్యాయామం చేయడానికి ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం కేటాయించాలి.

వ్యాయామంతో మీ రోజువారీ ఆహారాన్ని సమతుల్యం చేసుకోండి. దీంతో వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలను పొందుతారు.

పెళ్లికి వారం ముందు కాకుండా, పెళ్లికి కొన్ని నెలల ముందు ఇలా చేయడం వల్ల మీరు ఫీట్‌గా కనిపిస్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్