Telugu News  /  Lifestyle  /  Healthy Breakfast Neer Dosa And Its Making
నీర్ దోశ
నీర్ దోశ

Neer Dosa | నోరూరించే నీర్​ దోశ.. కొబ్బరి చట్నీతో లాగిస్తే ఆహా అనాల్సిందే..

12 March 2022, 10:23 ISTGeddam Vijaya Madhuri
12 March 2022, 10:23 IST

మనకు బ్రేక్​ఫాస్ట్ అంటే దోశ, ఇడ్లీ, వడ.. ఇలా చాలా ప్రత్యేకమైన టిఫెన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది దోశలకే మొగ్గు చూపుతారు. రకరకాల దోశలను ట్రై చేస్తారు. అయితే ఈ రోజు కొత్తగా నీర్​ దోశను చేసుకోండి. చాలా సులువుగా.. తక్కువ పదార్థాలతో ఇంట్లోనే చేసుకోగలిగే బ్రేక్​ఫాస్ట్ ఇది. మరి దాని టేస్ట్​ ఏంటో చూసేద్దామా?

సాధారణంగా దోశ అంటే పిండిని పులియబెడతాం. కానీ నీర్ దోసకు అదేమి అవసరం లేదు. ఎప్పుడు తినాలనిపించిన పిండి కలుపుకుని వేడి వేడి దోశలు వేసుకుని చక్కగా లాగించేయవచ్చు. దీనిని కొబ్బరి చట్నీతో కలిపి తీసుకుంటే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకున్నట్టే. దీనిని వెల్లుల్లి చట్నీ, సాంబార్, చికెన్ కర్రీ.. ఇలా మీకు నచ్చని చట్నీతో కూడా కలిపి తీసుకోవచ్చు. ఇంతకీ ఈ దోశను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

కావాల్సిన పదార్ధాలు

* బియ్యం (నానబెట్టాలి)

* ఎండుకొబ్బరి (తురుము)

* ఉప్పు (తగినంత)

* నీళ్లు (సరిపడినన్ని)

తయారీ విధానం

ఒక గిన్నెలో నానబెట్టిన బియ్యాన్ని తీసుకుని అందులో ఎండు కొబ్బరిని వేయాలి. కొద్దిగా నీళ్లతో గ్రైండ్ చేసి అందులో ఉప్పు కలపండి. ఇప్పుడు నీళ్లు పోసి మెత్తని పిండిగా తయారుచేయాలి.

ఇప్పుడు స్టౌవ్​ వెలిగించి పెనం పెట్టాలి. దానిలో గరిటెడు పెండి వేసి.. దోశలాగా వేసుకోవాలి. అంతే నీర్ దోశ రెడీ. మీకు నచ్చిన చట్నీతో దోశను లాగించేయవచ్చు.