Google Chrome | మీ గూగుల్ క్రోమ్ వెంటనే అప్డేట్ చేసుకోండి.. లేదంటే అంతే సంగతి!-google chrome users alert cert in sends high severity warning to google chrome ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Google Chrome Users Alert Cert In Sends High Severity Warning To Google Chrome

Google Chrome | మీ గూగుల్ క్రోమ్ వెంటనే అప్డేట్ చేసుకోండి.. లేదంటే అంతే సంగతి!

Rekulapally Saichand HT Telugu
Jan 11, 2022 06:13 PM IST

గూగుల్ క్రోమ్‌లో భద్రతా లోపాలు ఉన్నట్లు సాంకేతిక సంస్థ CERT-In గుర్తించింది. గూగుల్‌ క్రోమ్‌ వెర్షన్‌ 97.0.4692.71 కంటే కింది స్థాయి Chrome వెర్షన్‌ని వాడుతున్న వినియోగదారులు సైబర్ దాడికి గురయ్యే ప్రమాదం ఉందని CERT-In అభిప్రాయపడింది.

గూగుల్
గూగుల్ (REUTERS)

గూగుల్ క్రోమ్ (Google Chrome) బ్రౌజర్ వినియోగదారులకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్‌లో భద్రతా లోపాలు ఉన్నట్లు సంస్థ గుర్తించింది. గూగుల్‌ క్రోమ్‌ వెర్షన్‌ 97.0.4692.71 కంటే కింది స్థాయి Chrome వెర్షన్‌ని వాడుతున్న వినియోగదారులు సైబర్ దాడికి గురయ్యే ప్రమాదం అధికంగా ఉందని CERT-In అభిప్రాయపడింది. ఫైల్ మెనేజర్ ఏపీఐ (File Manager API ). యూజ్ ఆఫ్టర్ ఫ్రీ ఇన్ స్టోరేజీ (Use After Free In Storage), స్క్రీన్ కాప్చర్ (Screen capture), సైన్ ఇన్ (Sign in), ఆటోఫిల్ (Autofill), స్విఫ్ట్‌షేడర్(Swift Shader), పీడీఎఫ్ (PDF), పాస్‌వర్డ్ (Password), కంపోసింగ్ (Composing) ఫీచర్స్‌ మొదలగు వాటిల్లో ఇంప్లిమెంటేషన్‌లో లోపాలు ఉన్నట్లు సంస్థ పేర్కొంది.

గూగుల్‌ క్రోమ్‌ యూజర్స్‌కు సూచనలు

గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ వినియోగిస్తున్న యూజర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పలు సూచనలు చేసింది. యూజర్స్ తాము వినియోగిస్తున్న గూగుల్‌ క్రోమ్‌‌ను వెంటనే అప్‌డేట్ చేయాలని తెలిపింది. పాత వెర్షన్ స్థానంలో గూగుల్‌ క్రోమ్‌ తాజా వెర్షన్ 97.0.4692.71 ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. క్రోమ్‌ బ్రౌజర్‌ని ఎలా అప్‌డేట్ చేసుకోవాలో కూడా CERT-In వివరించింది. ముందుగా గూగుల్‌ క్రోమ్‌ (Google Chrome) బ్రౌజర్‌ని ఓపెన్‌ చేసి.. పైన ఉన్న చిన్న డాట్స్‌పై క్లిక్ చేస్తే హెల్ఫ్‌ ఆప్షన్ కపిసిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే అప్‌డేట్‌ బ్రౌజర్ అని కనిపిస్తుంది. ఈ ప్రకారంగా బ్రౌజర్ లేటెస్ట్ వెర్షన్‌‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్లలో గూగుల్‌ క్రోమ్‌ అప్‌డేట్‌ చేయాలంటే సింపుల్‌గా గూగుల్‌ ప్లే స్టోర్‌కి వెళ్లి.. గూగుల్‌ క్రోమ్‌ ఓపెన్ చేసినపుడు, అక్కడ కనిపించే అప్‌డేట్‌ అప్షన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం