Early Summer Tour | వేసవి ఆరంభంలోనే అదరగొట్టండి.. విహారయాత్రకు ఉత్తమ ప్రదేశాలు ఇవే!-from north to down south best places to visit in india in the early summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  From North To Down South Best Places To Visit In India In The Early Summer

Early Summer Tour | వేసవి ఆరంభంలోనే అదరగొట్టండి.. విహారయాత్రకు ఉత్తమ ప్రదేశాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Feb 27, 2023 05:00 PM IST

Places To Visit In Early Summer: ఎండాకాలం దాదాపు వచ్చినట్లే ఉంది, ఈ సమయంలో మీరు విహారయాత్ర చేయాలనుకుంటే భారతదేశంలోని ఉత్తమ ప్రదేశాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

Places To Visit In Early Summer
Places To Visit In Early Summer (Unsplash)

Places To Visit In Early Summer: వేసవి నెలల్లో కూర్గ్‌ను సందర్శించడం మంచిది, సముద్ర మట్టానికి 3840 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హిల్ స్టేషన్ మీకు చల్లని వాతావరణంను అందిస్తుంది. అందమైన పశ్చిమ కనుమల దృశ్యాలు, వెచ్చని కూర్గి కాఫీ రుచులను ఆస్వాదించవచ్చు. వేసవి దాదాపు వచ్చేసింది, మరి కొన్నాళ్లలో స్కూళ్లకు సెలవులు కూడా వచ్చేస్తాయి. మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఈ వేసవి సెలవులను ఆనందించాలనుకుంటే అందుకు ఇదే సమయం. మీ వాళ్లతో కలిసి ఎటైనా విహారయాత్రకు వెళ్లాలనుకుంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. చల్లటి హిల్ స్టేషన్లు మొదలుకొని, నిర్మలమైన బీచ్‌ల వరకు ప్రతి ఒక్కరి అభిరుచికి తగినట్లుగా భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.

ఈ వేసవి కాలంలో కొన్ని రోజులు గడపటానికి, మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని అద్భుతమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలియజేస్తున్నాం.

డార్జిలింగ్: అందమైన తేయాకు తోటలు, కలోనియల్ ఆర్కిటెక్చర్‌కు తూర్పు ఇండియాలోని డార్జిలింగ్ పట్టణం ప్రసిద్ధి. ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. నగర వీధులు, రహదారుల, పర్వతాలు మధ్య గుండా డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలో ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. పర్వతారోహణను ఇష్టపడేవారి కోసం హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఇక్కడ ఉంది.

మనాలి: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మనాలి వేసవిలో విహరించడానికి ఒక చల్లని ప్రదేశం. హిమాలయాల ఉత్కంఠభరితమైన దృశ్యాలను కనులారా వీక్షించవచ్చు. ఇంకా, ఈ సుందరమైన హిల్ స్టేషన్‌లో ట్రెక్కింగ్, క్యాంపింగ్, వంటి ఇతర అడ్వెంచర్ కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.

రిషికేశ్: ఆధ్యాత్మిక అనుభూతిని ఇష్టపడే వారికి రిషికేశ్ సరైన గమ్యస్థానం. ప్రపంచం యోగా రాజధానిగా ప్రసిద్ధి చెందిన రిషికేశ్ పట్టణంలో మీరు ధ్యానం, యోగా అందించే శిక్షణ కేంద్రాలను సందర్శించవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చు. భారతీయ ఆధ్యాత్మికత గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి ఇక్కడ ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు , ఆశ్రమాలను కూడా అన్వేషించవచ్చు. ఇక్కడి గంగానది ఒడ్డున ఉన్న నీలకంఠ మహదేవ ఆలయం దక్షిణ భారత ద్రవిడ నిర్మాణశైలిని కలిగి ఉండటం విశేషం.

జైపూర్: మీరు ఒక సాంస్కృతిక వైభవాన్ని అనుభూతి చెందాలనుకుంటే, రాజస్థాన్ లోని జైపూర్ వెళ్లవచ్చు. ఒకనాటి రాచరికపు కోటలు, విలాసాన్ని వీక్షించవచ్చు. రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్, ఉదయపూర్, జోధ్ పూర్, జైసల్మేర్ నగరాలను సందర్శించడం ద్వారా ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని జోధ్‌పూర్ చూడవచ్చు. చరిత్రను ఇష్టపడే వారికి ఈ ప్రాంతాలు చక్కటి యాత్రను అందిస్తాయి.

గోవా: మీరు బీచ్ వెకేషన్ కోసం చూస్తున్నట్లయితే, గోవా సరైన గమ్యస్థానం. ఏ సీజన్ అయినా గోవా పర్యటించటానికి అనువైన సీజనే. అందమైన బీచ్‌లు, పొద్దుపొడవని నైట్ లైఫ్, రుచికరమైన సీఫుడ్, ప్రత్యేకమైన సంస్కృతికి గోవా ప్రసిద్ధి చెందింది. మీరు బీచ్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు, వాటర్ స్పోర్ట్స్‌లో మునిగి తేలవచ్చు లేదా స్థానిక మార్కెట్‌లలో షాపింగ్ చేయవచ్చు. ఇంకా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ చర్చిలు, దేవాలయాలకు కూడా గోవా నిలయం.

కూర్గ్: వేసవి నెలల్లో కూర్గ్‌ను సందర్శించడం మంచిది, సముద్ర మట్టానికి 3840 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హిల్ స్టేషన్ మీకు చల్లని వాతావరణంను అందిస్తుంది. అందమైన పశ్చిమ కనుమల దృశ్యాలు, వెచ్చని కూర్గి కాఫీ రుచులను ఆస్వాదించవచ్చు. బోటింగ్ టూర్లు, నీటి క్రీడలలో మునిగి తేలవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం