Friday Motivation : మీరు ఏమి చెప్తారో దానికే బాధ్యులు.. వారికి ఏమి అర్థమయ్యిందో దానికి కాదు-friday quote on you re responsible for what you say not responsible for what they understand ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Friday Quote On You're Responsible For What You Say. Not Responsible For What They Understand.

Friday Motivation : మీరు ఏమి చెప్తారో దానికే బాధ్యులు.. వారికి ఏమి అర్థమయ్యిందో దానికి కాదు

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 16, 2022 06:54 AM IST

చెప్పడం ఒక ఆర్ట్ అయితే.. అర్థం చేసుకోవడం మరొక ఆర్ట్. అర్థమయ్యేలా చెప్పడమనేది ఇంక సూపర్​ అనే చెప్పవచ్చు. కానీ కొందరికి ఎంత చెప్పినా.. వాళ్లు అర్థం చేసుకోవాలనుకున్నదే అర్థం చేసుకుంటారు. కాబట్టి దానికి మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : మీరు ఏమి చెప్తారో దానికి మాత్రమే బాధ్యులు. ఎదుటివారు ఏమి అర్థం చేసుకున్నారో దానికి మాత్రం కాదు. ఎందుకంటే మీరు ఎంతగా చెప్పినా వారికి అర్థం కాదు. పరిస్థితులే వారికి అన్ని అర్థమయ్యేలా చేస్తాయి. అప్పటివరకు మీరు ఏదైతే చెప్పారో దానికి మాత్రమే బాధ్యులు. వారు ఏది అర్థం చేసుకున్నారో దానికి మాత్రం కాదు.

కొందరు మన మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటారు. మరి కొందరు ఎంత చెప్పినా.. ఏమి చెప్పినా.. ఎలా చెప్పినా అర్థం చేసుకోరు. పైగా మీరేమి చెప్పట్లేదని మిమ్మల్ని నిందిస్తారు. అంతేకాకుండా మీరు చెప్పారని ఒప్పుకున్న.. తప్పుగా చెప్పినట్లు ప్రవర్తిస్తారు. అప్పుడు మీరు ఇంక ఫిక్స్ అయిపోవాలి. వారికి అర్థం చేసుకునే సామర్థ్యం లేదని.

వారు అర్థం చేసుకోకపోయినా పర్లేదు. కానీ దాని వల్ల సమస్యలు వచ్చినా.. లేక మిమ్మల్ని పలు మాటలు అన్నా.. మీరు ఏమి బాధపడకండి. ఎందుకంటే మీరు ఏమి చెప్తారో దానికి మాత్రమే బాధ్యులు. అంతేకానీ వారు ఏమి అర్థం చేసుకున్నారో దానికి కాదు కదా. ఒక్కొక్కరికి అర్థం చేసుకునే సామర్థ్యం లేకపోవచ్చు. మరికొందరు కావాలనే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా సతాయించవచ్చు. కొందరు అర్థం చేసుకున్నా అర్థం కానట్లు నటించవచ్చు. వీటన్నింటి గురించి ఆలోచిస్తూ మీ బుర్ర పాడు చేసుకోవడం కంటే.. ఏదైనా సమస్య వస్తే దానిని ఎలా ఎదుర్కోవాలో ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ఇలాంటివారి వల్ల ఏదొకరోజు ఆర్గ్యూమెంట్స్ అయ్యే అవకాశముంటుంది.

ఓ క్లాస్​లో టీచర్​ పాఠం చెప్తే అందరికీ అర్థం అవ్వదు కదా. కొందరు త్వరగా అర్థం చేసుకుంటారు. మరి కొందరు ఆలస్యంగా. కానీ టీచర్​కు అందరూ పాస్ అయితేనే ఆనందం. ఒకరో, ఇద్దరో ఆమె చెప్పిన పాఠలు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించకపోతే ఇంక ఆమెకు వారికి చెప్పాల్సిన అవసరం లేదనే అర్థం ఎందుకంటే. కనీసం చెప్పేది వినేందుకు ప్రయత్నించకుండా అర్థం కాలేదు అనడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి.

మీరు చెప్పేది అర్థం చేసుకోలేని వారికి మళ్లీ చెప్పండి. వాళ్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు అని మీకు తెలిసినప్పుడు ఆపేయండి. ఎందుకంటే అర్థం కాలేదని వాళ్లు బాధపడతారు. అర్థం చేసుకోలేదే అని మీరు బాధపడతారు. మళ్లీ ప్రయత్నించడం వల్ల ఆ సమస్య ఉండదు. అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేశాను అనే సంతృప్తి మీకు ఉంటుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ద హిస్టరీ మీరు పట్టించుకోకపోవడం బెటర్.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్