Drinking Water:తినేటప్పుడు నీరు త్రాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు !-drinking water with meals lead to digestive issues ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drinking Water:తినేటప్పుడు నీరు త్రాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు !

Drinking Water:తినేటప్పుడు నీరు త్రాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు !

HT Telugu Desk HT Telugu
Sep 01, 2022 08:34 PM IST

Drinking Water During Eating: మన ఆరోగ్యానికి నీరు త్రాగడం చాలా అవసరం. కానీ ఆహారం తీసుకునే సమయంలో నీరు తాగడం చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Drinking Water
Drinking Water

తినే సమయంలో నీరు త్రాగడం: మన ఆరోగ్యం ప్రతిరోజూ తిసుకునే ఆహారం, త్రాగే నీటిపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే, సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. దీనితో పాటు, సరైన మొత్తంలో నీటి వినియోగం (Drinking Water) కూడా ముఖ్యమైనది. ఆహారంలానే తాగునీటికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి . ఇవి పాటించకపోతే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా కొందరికి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం తొందరగా ఆహారం జారడం తేలికవుతుంది. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది (Health tips) కాదని నిపుణులు అంటున్నారు .

భోజనం చేసేటప్పుడు నీళ్లు ఎందుకు తాగకూడదు?

తినేటప్పుడు నీరు ఎందుకు త్రాగకూడదో తెలియాలంటే మొదటగా ఆహారం తిసుకునే విధానంపై స్పష్టత ఉండాలి. సాధారణంగా ఆహారం నోటిలోకి వెళ్ళగానే రు దానిని నమలడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో గ్రంథులు లాలాజలాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. ఈ లాలాజలంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేసే ఎంజైములు ఉంటాయి. ఈ ఎంజైమ్‌లు కడుపులోని ఆమ్ల జఠర రసాలతో మిళితం అవుతాయి. మందపాటి ద్రవాన్ని ఏర్పరుస్తాయి. ఈ ద్రవాలు చిన్న ప్రేగు గుండా వెళతాయి. ఇవి పోషకాలను గ్రహించడం ప్రారంభిస్తాయి. సాధరణంగా నీరు ఎక్కువగా తాగితే, అది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీనితో పాటు జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుంది. కానీ తినేటప్పుడు నీరు త్రాగితే, అది ప్రమాదకరం. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం మంచిది కాదు. ఇది మన జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది.

భోజనంతో పాటు నీరు త్రాగడం వల్ల యాసిడ్ జీర్ణ ఎంజైమ్‌లు పలచబడి జీర్ణక్రియను సులభతరం చేస్తుందని కొందరు నమ్ముతారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. మరోవైపు, తినే సమయంలో నీరు త్రాగడం జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. పొట్ట రావడానికి కారణమవుతుంది. ఊబకాయానికి దారితీస్తుంది. మొత్తం శరీర ఆకృతి మారుతుంది.

నీరు ఎప్పుడు త్రాగాలి?

సాధారణంగా, చాలా మంది ఆరోగ్య నిపుణులు భోజనం చేసిన వెంటనే నీరు త్రాగకుండా ఉండాలని సలహా ఇస్తారు. తిన్న అరగంట తర్వాత నీరు త్రాగడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం