HIV Stats In India | సేఫ్ సెక్స్​పై అవగాహన కల్పిస్తున్న నిపుణులు.. ఎందుకంటే..-doctors said safe sext is must due to hiv stats in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Doctors Said Safe Sext Is Must Due To Hiv Stats In India

HIV Stats In India | సేఫ్ సెక్స్​పై అవగాహన కల్పిస్తున్న నిపుణులు.. ఎందుకంటే..

HT Telugu Desk HT Telugu
Apr 26, 2022 08:38 AM IST

భారత దేశంలో పదేళ్లకాలంలో హెచ్​ఐవీ 17 లక్షలకు పైగా సోకినట్లు ఆర్టీఐ వెల్లడించింది. ఏపీలో అత్యధిక హెచ్​ఐవీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 లక్షల మందికి పైగా హెచ్​ఐవీ సోకినట్లు తేలింది. అసురక్షితమైన సంభోగం ద్వారానే హెచ్​ఐవీ సోకినట్లు గుర్తించారు. ఈ క్రమంలో సురక్షితమైన సెక్స్​పై అవగాహన కల్పిస్తున్నారు నిపుణులు.

ఆందోళన కలిగిస్తున్న హెచ్​ఐవీ గణాంకాలు
ఆందోళన కలిగిస్తున్న హెచ్​ఐవీ గణాంకాలు

Awareness on Safe Sex | భారతదేశంలోని హెచ్​ఐవీ గణాంకాలు చాలా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. ఈ క్రమంలో సురక్షితమైన సెక్స్‌ను ఎందుకు అవసరమో చెప్తున్నారు వైద్య నిపుణులు. ఆర్టీఐ ప్రశ్నకు ప్రతిస్పందనగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) ఈ డేటాను అందించింది. NACO ప్రకారం.. భారతదేశంలో 2011-2021 మధ్య 17,08,777 మంది అసురక్షిత సెక్స్ ద్వారా హెచ్ఐవీ బారిన పడ్డారు. ప్రీ-టెస్ట్/పోస్ట్-టెస్ట్ కౌన్సెలింగ్ సమయంలో హెచ్‌ఐవి పాజిటివ్ వ్యక్తులు ఇచ్చిన ప్రతిస్పందన ద్వారా హెచ్‌ఐవి ట్రాన్స్‌మిషన్ మోడ్‌పై సమాచారం రికార్డ్ చేశారు.

హెచ్​ఐవీ అంటే ఏమిటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) రోగనిరోధక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది అనేక అంటువ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా రక్షణను బలహీనపరుస్తుంది. ఈ వైరస్ రోగ నిరోధక కణాల పనితీరును నాశనం చేసి, వాటిని బలహీనపరుస్తుంది. కాబట్టి వైరస్ సోకిన వారు క్రమంగా ఇమ్యునో డిఫిషియెంట్​కు గురవుతారు. హెచ్​ఐవీ సంక్రమణ ఒక అధునాతన దశలో, ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్ (AIDS)గా రూపొందుతుంది.

ఎలా సోకుతుందంటే..

రక్తం, తల్లి పాలు, వీర్యం, యోని స్రావాలు వంటి వాటి ద్వారా హెచ్​ఐవీ సోకుతుంది. వైరస్ సోకిన వ్యక్తుల నుంచి వివిధ రకాల శరీర ద్రవాల మార్పిడి చెందుతుంది. ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, కరచాలనం చేయడం లేదా వ్యక్తిగత వస్తువులు ఉపయోగించడం, ఆహారం లేదా నీటిని పంచుకోవడం వంటి చర్యలు ద్వారా హెచ్​ఐవీ వ్యాప్తి ఉండదని డబ్ల్యూహెచ్​వో స్పష్టం చేసింది.

లైంగికంగా సంక్రమించే వ్యాధులు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణలు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) లైంగికంగా సంక్రమించిన వ్యాధులు (STDలు) నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు.

1. హెచ్​పీవీ టీకా

హెచ్​పీవీ అంటే హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV), ఇది లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రకారం.. హెచ్​పీవీ అనేది 200 కంటే ఎక్కువ సంబంధిత వైరస్​ల సమూహం. వీటిలో 40 కంటే ఎక్కువ ప్రత్యక్ష లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తాయి. హెచ్​పీవీ టీకా ద్వారా నివారణ అత్యంత ప్రభావవంతమైన ఎంపికలలో ఒకటిగా ఉద్భవించింది.

2. లైంగిక భాగస్వాముల సంఖ్య తగ్గించండి

బహుళ లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం వలన మీరు లైంగికంగా సంక్రమించే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువ. మీ భాగస్వామి లైంగిక ఆరోగ్య చరిత్ర గురించి మీకు తెలియకపోతే వాటి ప్రమాదం మరీ ఎక్కువ ఉంటుంది.

3. పరస్పర ఏకస్వామ్యం

మీరు, మీ భాగస్వామి ఒకరితో ఒకరు మాత్రమే లైంగికంగా చురుకుగా ఉండటానికి అంగీకరించడాన్నే.. పరస్పర ఏకస్వామ్యం అంటారు. వ్యాధి సోకని భాగస్వామితో లైంగిక చర్యలో పాల్గొనడం వలన మీరు హెచ్​ఐవీ సంక్రమణను నివారించవచ్చు.

4. కండోమ్ ఉపయోగించండి

కండోమ్‌లు కేవలం జనన నియంత్రణ పద్ధతిగా కాకుండా, లైంగికంగా సంక్రమించే వ్యాధులు, ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షణ పొందేందుకు ఉపయోగించాలి. సెక్స్‌లో ఉన్నప్పుడు కండోమ్‌ను ఉపయోగించాల్సిందేనని మీ భాగస్వామికి తెలపండి. మహిళలకు కూడా కండోమ్​లు అందుబాటులో ఉంటున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్