హోలీ స్పెషల్ 'పింక్ ఛాయ్'.. దీని రంగు, రుచి పూర్తిగా అలగ్!-blogger shares video of pink chai internet divided over its name ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Blogger Shares Video Of Pink Chai. Internet Divided Over Its Name

హోలీ స్పెషల్ 'పింక్ ఛాయ్'.. దీని రంగు, రుచి పూర్తిగా అలగ్!

HT Telugu Desk HT Telugu
Mar 15, 2022 03:55 PM IST

బుక్కాగులాల్ రంగులో 'పింక్ ఛాయ్' అనే సరికొత్త ఫ్లేవర్ ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీని సీక్రెట్ రెసిపీ ఇక్కడ చూడండి..

A screengrab of the video of ‘pink chai’ being prepared by a street vendor
A screengrab of the video of ‘pink chai’ being prepared by a street vendor (yumyumindia/Instagram/Pixabay)

రంగు-రుచి- చిక్కదనాల చక్కటి 'టీ' ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా మనం రోజూ తాగే ఛాయ్‌కి విరుద్ధంగా బుక్కాగులాల్ రంగులో 'పింక్ ఛాయ్' అనే సరికొత్త ఫ్లేవర్ ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఒక వైరల్ వీడియోలో ఉత్తర్ ప్రదేశ్ లక్నోకి చెందిన ఒక టీ వెండర్.. కప్పులో బాంబే ఖారీ లేదా పఫ్ ఖారీని విరిచి వేస్తున్నాడు. అందులో కొద్దిగా వెన్నను కూడా వేస్తున్నాడు. ఆ తర్వాత ఛాయ్ తయారుచేసే కంటైనర్ నుంచి వేడివేడి పింక్ ఛాయ్‌ని పోస్తున్నాడు. దీంతో చూస్తేనే నోరూరేలా ఉందంటూ ఆ పింక్ ఛాయ్ కోసం జనాలు ఫిదా అవుతున్నారు. ఆ ఛాయ్ ఎలా తయారుచేసుకోవాలి అంటూ విపరీతంగా దీని రెసిపీకోసం వెతకడం ప్రారంభించారు.

అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఇది అసలు పింక్ ఛాయ్ కానేకాదు. ఉత్తర భారత దేశంలోని జమ్మూ- కాశ్మీర్‌లో ముఖ్యంగా లద్దాఖ్ లాంటి హిల్ స్టేషన్లలో 'నూన్ ఛాయ్' గా ఇది చాలా ఫేమస్ అని చెప్తున్నారు. నూన్ ఛాయ్ ఉప్పగా ఉంటుంది. ఎందుకంటే కశ్మీరి భాషలో ఉప్పును 'నూన్' అని పిలుస్తారు. అది అక్కడ లభించే కొన్ని స్పైసెస్‌తో తయారు చేస్తారు. అయినా కూడా వీడియోలో చూపించినట్లుగా మరీ అంత గులాబీ రంగులో ఉండదు అని చెబుతున్నారు.

మరీ ఈ ఛాయ్‌కి ఆ గులాబీ రంగు ఎలా వచ్చింది? అని ఆరాతీయగా.. వేడివేడి పాలల్లో 'రూహ్ అఫ్జ' అనే పానీయం కలపడంతో ఆ రంగు వచ్చింది. దానిని అతడు ఛాయ్ పేరుతో సొమ్ముచేసుకుంటున్నాడని చెప్తున్నారు. ఏదేమైనా టీ లవర్స్ ఇప్పుడు ఈ పింక్ టీని తయారు చేసుకొని తాగేస్తున్నారు. టేస్టు కోసం ఉప్పుకు బదులుగా షుగర్ వేసుకుంటున్నారు.

ఇప్పుడు ఈ ఫ్లేవర్ దేశంలోని మిగతా రాష్ట్రాలకు విస్తరించి ఛాయ్ ప్రేమికులకు ఫేవరెట్‌గా మారుతోంది. హోలీ పండగ కూడా ఉండటంతో హోలీ స్పెషల్ టీ అంటూ ఈ పింక్ ఛాయ్‌ను పరిచయం చేస్తున్నారు.

Watch Here:

WhatsApp channel

సంబంధిత కథనం