Benling India నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Believe విడుదల, ధర ఎంతంటే?!-benling india s e scooter believe launched check on road price details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Benling India's E-scooter Believe Launched, Check On-road Price Details

Benling India నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Believe విడుదల, ధర ఎంతంటే?!

HT Telugu Desk HT Telugu
Aug 17, 2022 10:38 PM IST

దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు Benling India తాజాగా బిలీవ్ (Believe) పేరుతో ఒక లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ధర, ఇతర వివరాలను తెలుసుకోండి.

Benling India's e-scooter Believe
Benling India's e-scooter Believe

గురుగ్రామ్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు బెన్లింగ్ ఇండియా (Benling India) తమ బ్రాండ్ నుంచి బిలీవ్ (Believe) పేరుతో ఒక లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ వద్ద ఈ స్కూటర్ ధర రూ. 97,520/- గా నిర్ణయించారు. ఇది భారతీయ రోడ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన హై-స్పీడ్ ఇ-స్కూటర్ అని కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలలోని 160 నగరాల్లో తమ డీలర్‌షిప్‌ల ద్వారా ఈ స్కూటర్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని Benling India తెలిపింది.

కొత్తగా ఆవిష్కరించిన Benling Believe స్కూటర్ మోడల్ కోసం కొత్త తరం ఎలక్ట్రిక్ LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీలను కూడా కంపెనీ ఆవిష్కరించింది. ఇది ఆగస్టు 25, 2022 నుండి కంపెనీకి చెందిన అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుంది.

బిలీవ్ హై-స్పీడ్ ఇ-స్కూటర్ ఆరు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. పసుపు, నీలం, నలుపు, తెలుపు, పర్పుల్ అలాగే మ్యాజిక్ గ్రే రంగులో లభిస్తుంది.

బ్యాటరీ కెపాసిటీ- ప్రయాణ పరిధి

Benling Believe ఇ-స్కూటర్‌లో 3.2 kw కెపాసిటీ కలిగిన LFP రిమూవేబుల్ బ్యాటరీ ప్యాక్‌ను, అలాగే వాటర్‌ప్రూఫ్ BLDC మోటార్‌ను అమర్చారు. ఇది ఫుల్ ఛార్జ్‌పై 120 కిమీ ప్రయాణ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ గంటకు 75 కిమీల గరిష్ట వేగంతో పరుగులు తీస్తుంది.

ఈ స్కూటర్ కొనుగోలుదారులకు ఆటో కట్ ఆఫ్ సిస్టమ్‌ను కలిగిన LFP బ్యాటరీ ప్యాక్ మైక్రో ఛార్జర్ అందిస్తున్నారు. సుమారు నాలుగు గంటలలో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కాగలదు.

ఫీచర్లు

కొత్త బిలీవ్ ఇ-స్కూటర్‌లో కీలెస్ స్టార్ట్, మల్టిపుల్ స్పీడ్ మోడ్‌లు, యాంటీ-థెఫ్ట్ అలారం ఫీచర్, రీజెనరేటివ్ బ్రేకింగ్, మొబైల్ యాప్ కనెక్టివిటీ, పార్క్-అసిస్ట్ ఫంక్షన్, మొబైల్ ఛార్జింగ్ , రియల్ టైమ్ ట్రాకింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

ఇందులో స్మార్ట్ బ్రేక్‌డౌన్ అసిస్ట్ ఫీచర్ ఉంది. ఇది స్కూటర్ మధ్యలో ఎక్కడైనా బ్రేక్‌డౌన్ అయితే, కేవలం దీని నాబ్‌ను పట్టుకోవడం ద్వారా సుమారు 25 కి.మీల వరకు సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ ఇప్పటికే 1,20,000 డెలివరీలను షెడ్యూల్ చేసింది. అదనంగా కంపెనీ హైస్పీడ్, అలాగే స్లో స్పీడ్ విభాగాలలో 3 E2W మోడల్‌లను ఉత్పత్తి చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం