Laptop on lap: ల్యాప్‌టాప్ ఒళ్లో పెట్టుకుని వాడితే.. స్పర్మ్ కౌంట్ తగ్గుతుందా?-bad health effects of using laptop by keeping it on lap ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Bad Health Effects Of Using Laptop By Keeping It On Lap

Laptop on lap: ల్యాప్‌టాప్ ఒళ్లో పెట్టుకుని వాడితే.. స్పర్మ్ కౌంట్ తగ్గుతుందా?

HT Telugu Desk HT Telugu
May 24, 2023 08:18 PM IST

Laptop on lap: తొడమీద ల్యాప్‌టాప్ పెట్టుకుని వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. అవేంటో చూడండి. తప్పకుండా జాగ్రత్త పడతారు.

ల్యాప్‌టాప్ వాడకం
ల్యాప్‌టాప్ వాడకం (pexels)

ఆఫీసు పని చేయడానికి, కొంతమంది గేమ్స్ ఆడటానికి, మరికొంత మంది వీడియోలు, సినిమాలు చూడటానికి ల్యాప్ టాప్ తొడ మీద పెట్టుకుంటారు. అలా చేయడం స్మర్మ్ కౌంట్ కీ, చర్మ వ్యాధులకీ..ఇంకొన్ని సమస్యలకీ కారణం అవుతుంది. ల్యాప్‌టాప్ తొడమీద పెట్టుకుని వాడటం వల్ల కలిగే నష్టాలేంటో తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

1. స్పర్మ్ కౌంట్: ల్యాప్‌టాప్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ వల్ల స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల మీద ప్రభావం పడుతుంది. మగవారిలో స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలున్నాయి. అలాగే స్పర్మ్ మొటిలిటీ అంటే శుక్రకణం కదిలే వేగం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందట. అయితే ఓ అరంగంట వాడగానే ఈ సమస్య వస్తుందని కాదు. గంటలకొద్దీ గేములు, వీడియోలు చూడటం, ఎక్కువ సేపు తొడమీదే పెట్టుకుని ఆఫీసుపని చేయడం వల్ల ల్యాప్‌టాప్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. రేడియేషన్ తో పాటే మామూలు కన్నా 4 నుంచి 5 డిగ్రీల వేడి

పెరిగిందంటే దానివల్ల తప్పకుండా స్పర్మ్ సంఖ్య మీద, క్వాలిటీ మీద ప్రభావం పడుతుంది. సంతాన లేమి సమస్యకు కారణమవుతుంది.

2. వెన్ను నొప్పి: ల్యాప్ టాప్ తొడల మీద పెట్టుకోవడం వల్ల తెలీకుండానే మెడలు, వెన్ను వంపుతాం. దానివల్ల దీర్ఘకాలికంగా సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్య రాకూడదంటే ఒక డెస్క్ మీద పెట్టుకుని సరైన స్థతిలో కూర్చుని ల్యాప్‌టాప్ వాడటం ఉత్తమం.

3. చర్మ సమస్యలు: ల్యాప్ టాప్ తొడమీద పెట్టుకోవడం వల్ల చర్మం ఎర్రగా మారే ప్రమాదం ఉంది. కొన్ని సార్లు దురద లేదా మంట రావడం జరుగుతుంది. ఈ సమస్య పట్టించుకోకుండా దీర్ఘకాలికంగా వాడటం వల్ల చర్మం రంగు మారొచ్చు కూడా.

4. కంటి సమస్యలు: చాలా మంది బెడ్ మీద పండుకుని అలా కాళ్లను కాస్త పైకి లేపి ల్యాప్‌టాప్ ను తొడల మీద ఆనించి పనిచేస్తారు. అపుడు ల్యాప్‌టాప్ చూడటానికి కళ్ల మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా నిద్రపోయే ముందు ఇలా చేయడం వల్ల నిద్ర కూడా సరిగ్గాపట్టదు. కళ్లకు సరైన దూరంలో ఉంచి ల్యాప్‌టాప్ వాడాలి. లేదంటే బ్లూ లైట్ రిఫ్లెక్ట్ చేసే కళ్లద్దాలు వాడటం కాస్త మేలు.

5. ప్రెగ్నెన్సీ: రేడియేషన్ ప్రభావం మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద అంతగా ప్రభావం చూపదు. కానీ గర్బంతో ఉన్నవాళ్లు ల్యాప్ లాప్ తొడమీద పెట్టుకుని పనిచేయడం ప్రమాదం. వేడి వల్ల పుట్టబోయే బిడ్డమీద ప్రభావం ఉండొచ్చని గుర్తుంచుకోండి.

సలహాలు:

  • తొడమీద పెట్టుకుని వాడాల్సి వస్తే యాంటీ రేడియేషన్ ప్యాడ్ వాడండి.
  • వేడిని తక్కువ చేసే కూలింగ్ ప్యాడ్ వాడండి.
  • వీలైనంత సేపు డెస్క్ మీద ఉంచే ల్యాప్‌టాప్ ఉపయోగించాలి.

WhatsApp channel

టాపిక్