ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ ఫోన్‌ను ఈజీగా ఆపరేట్ చేయొచ్చు!-android phone keyboard trick how to enable one handed mode gboard ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Android Phone Keyboard Trick How To Enable One Handed Mode Gboard

ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ ఫోన్‌ను ఈజీగా ఆపరేట్ చేయొచ్చు!

HT Telugu Desk HT Telugu
Jun 18, 2022 10:32 PM IST

ఇప్పుడు చాలా వరకు మెుబైల్ కంపెనీలు 6.5 అంగుళాల స్క్రీన్‌తో ఫోన్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఇంత పెద్ద ఫోన్‌ని ఒక చేత్తో ఆపరేట్ చేయడం చాలా కష్టం. అయితే చిన్న ట్రిక్ ద్వారా ఒక చేత్తో కూడా ఫోన్ కీ బోర్డును టైప్ చేయవచ్చు.

Mobiles Phones
Mobiles Phones

చాలా వరకు వివిధ ఫోన్ బ్రాండ్స్‌కు సంబంధించిన మెుబైల్స్ పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు చాలా కంపెనీలు 6.5 అంగుళాలతో పెద్ద స్క్రీన్ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఇంత పెద్ద ఫోన్లను ఒక చేత్తో ఆపరేట్ చేయడం చాలా  కష్టంగా ఉంటుంది. ఏదైనా వీడియోను చూడలన్నా.. ఆర్టికల్ చదవాలన్నా లేదా చాటింగ్ చేయలన్నా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చిన్న ట్రిక్ ద్వారా ఎంత పెద్ద ఫోన్ అయిన సులువుగా ఒంటి చెత్తో టైప్ చేయవచ్చు . దీని కోసం ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో ప్లే స్టోర్ నుండి GBoard అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీంతో ఈ యాప్ కీబోర్డ్ ద్వారా సులువుగా మీ పోన్‌ను ఆపరెట్ చేయవచ్చు.

 డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఫోన్‌లో Gboard  కీబోర్డ్‌ను డిఫాల్ట్‌గా ఎంచుకోండి.

దీని కోసం, మీరు మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి కీబోర్డ్‌ను  సెర్చ్ చేసి డిఫాల్ట్ కీబోర్డ్‌ని ఎంచుకోవాలి.

ఇప్పుడు ఏదైనా చాట్‌ని తెరిచి, కీబోర్డ్‌ని ఓపెన్ చేయండి.

-తర్వాత కీబోర్డ్‌లోని కామా (,)ని కొద్దిసేపు నొక్కి పట్టుకోండి.

ఇక్కడ మీకు ఎమోజీ, సెట్టింగ్‌, వన్ హ్యాండ్ మోడ్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. తర్వాత థర్డ్ ఆప్షన్‌కు వెళ్లండి.

- ఇలా చేయడం వల్ల కీబోర్డ్ పరిమాణంలో చిన్నదిగా మారుతుంది. దీంతో ఒక చేత్తో సులభంగా టైపింగ్ చేయవచ్చు.

మీకు కావాలంటే, మీరు దాని స్థానాన్ని కూడా  మార్చుకోవచ్చు.

 

WhatsApp channel