Baleno 2022 | మారుతీ సుజుకీ బాలెనో లేటెస్ట్ వెర్షన్ లాంచ్.. ఈ కారు ధర ఎంతంటే?
ప్రముఖ వాహన సంస్థ మారుతీ సుజుకీ తన 2022 బాలెనో వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఎక్స్‌షోరూంలో దీని ప్రారంభ ధర వచ్చేసి రూ.6.35 లక్షలుగా నిర్దేశించింది. అంతేకాకుండా ఇది విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది.
భారత్‌లో అత్యుత్తమ వాహనాలు విడుదల చేస్తూ వినియోగదారులు ఆదరణ పొందుతున్న సంస్థల్లో మారుతీ సుజుకీ ముందు వరుసలో ఉంది. అందులోనూ ఈ కంపెనీ నుంచి లాంచ్ అయిన కార్లలో బాలెనో మోడల్ ఎంతో విజయవంతమైంది. తాజాగా ఈ మోడల్‌కు సంబంధించిన 2022 వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది ఈ ఆటోమేకర్. 2022 బాలెనో మోడల్‌ను లాంచ్ చేసింది. ఎక్స్‌షోరూంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ.6.35 లక్షలుగా నిర్దేశించింది. గరిష్ఠంగా దీని ధర రూ.09.45 లక్షల వరకు నిర్ణయించింది. నాలుగు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ హ్యాచ్‌బ్యాక్ ఆకట్టుకుంటోంది.
ట్రెండింగ్ వార్తలు
వేరియట్ల వారీగా ధర..
మారుతీ సుజుకీ సిగ్మా వేరియంట్ ధర- రూ.6.35 లక్షలు
డెల్టా వేరియంట్ - రూ.07.19 లక్షలు
జెటా వేరియంట్- రూ.08.09 లక్షలు
ఆల్ఫా వేరియంట్- రూ.8.99 లక్షలు
డెల్టా ఏజీఎస్ వేరియంట్- రూ.07.69 లక్షలు
జెటా ఏజీఎస్ వేరియంట్- రూ.08.59 లక్షలు
ఆల్ఫా ఏజీఎస్ వేరియంట్- రూ.09.49 లక్షలు.
ఈ ధరలన్నీ ఎక్స్‌షోరూంకు సంబంధించినవి. ఆన్ రోడ్ ప్రైస్ ఇంకా ఎక్కువ ఉండవచ్చు. అంతేకాకుండా నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను చెల్లించి ఈ సరికొత్త బాలెనో వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. కనీస సబ్‌స్క్రిప్షన్ రూ.13,999ల నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ కారు నెక్సా బ్లూ, స్ప్లెండర్ సిల్వర్, గ్రాడియర్ గ్రే, లక్స్ బీగే, అపులెంట్ రెడ్, పెరల్ ఆర్కిటిక్ వైట్ లాంటి విభిన్న రంగుల్లో లభ్యమవుతుంది.
కొత్తగా వచ్చిన అప్డేట్లు..
ఈ సరికొత్త 2022 బాలెనో వాహనంలో బాహ్య, వెలుపల ఎన్నో మార్పులు చేసింది కంపెనీ. ఫ్రంట్ వైపు ప్రకాశవంతమైన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్లను పొందుపరిచింది. అంతేకాకుండా ఫ్రంట్ గ్రిల్‌ను రీడిజైన్ చేసింది. ఫ్రంట్ బంపర్ మరింత అగ్రెసివ్‌గా కనిపించేలా అప్డేట్ చేసింది. వెనుక భాగానికి వస్తే సరికొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులను రీప్లేస్ చేసింది. అంతేకాకుండా డైమంట్ కట్ అల్లాయ్ వీల్స్, క్రోమమ్ సెటప్ కారును ఆకర్షణీయంగా మార్చింది.
ఫీచర్లు..
ఈ కారు అంతర్గత ఫీచర్ల దగ్గరకొస్తే క్యాబిన్‌లోని డ్యాష్‌బోర్డును పూర్తిగా రీడిజైన్ చేశారు. అతిపెద్ద స్మార్ట్ ప్లే ప్రో టచ్ స్క్రీన్, హారిజంటల్ ఏసీ వెంట్స్, పునరుద్ధరించిన ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, 360 డిగ్రీల కెమెరా, 9.0 అంగుళాల హెచ్‌డీ టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, క్లైమేట్ కంట్రోల్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పవర్ ఓఆర్‌వీఎం, రియర్ ఏసీ వెంట్స్, జియో ఫెన్సింగ్, టైమ్ ఫెన్సింగ్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇంజిన్..
ఈ సరికొత్త 2020 మారుతీ సుజుకీ బాలెనోలో సింగిల్ ఇంజిన్ మాత్రమే ఉంది. ఇది 1.2-లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండి 80bhp బ్రేక్ హార్స్ పవర్, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది దీని గత మోడల్ మాదిరిగానే 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్‌తో పనిచేస్తుంది. అయితే పాత మోడల్‌లో ఉండే సీవీటీ గేర్ బాక్స్ స్థానంలో 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌ను అమర్చారు. అదనంగా 12 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థన ఇంజిన్‌తో పాటు పొందుపరిచారు.
సేఫ్టీ ఫీచర్ల దగ్గరకొస్తే ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ESP, ఏబీఎస్, ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, పిల్లల కోసం ISOFIXతో పాటు 14-అంగుళా డిస్క్ బ్రేకులను కూడా అమర్చి సస్పెన్షన్ సిస్టమ్‌ను మెరుగుపరిచారు.
సంబంధిత కథనం