Fast and Furious : సినిమా చూసి.. 82 వేలు గెలుచుకోవచ్చు-this website will pay you 1000 dollars to watch all fast and furious films heres why ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  This Website Will Pay You 1000 Dollars To Watch All Fast And Furious Films Here's Why

Fast and Furious : సినిమా చూసి.. 82 వేలు గెలుచుకోవచ్చు

ఫాస్ట్ X
ఫాస్ట్ X (twitter)

Fast and Furious : మనం సినిమా చూసేందుకు డబ్బులు చెల్లిస్తాం. కానీ ఓ సినిమా చూసి మీరు డబ్బులు తీసుకోవచ్చు. కానీ కొన్ని కండీషన్స్ ఉన్నాయి.

సినిమా చూడాలంటే.. కచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఇక ఫ్యామిలీతో వెళితే.. వేల ఖర్చు ఉంటుంది. అయితే మీరు సరిగా ప్లాన్ చేస్తే.. సినిమా చూసి డబ్బులు గెలుచుకోవచ్చు. వంద.. రెండొందలు కాదు.. 82వేల రూపాయలు మీ సొంతం అవుతాయి. అయితే ఇక్కడో చిన్న విషయం గమనించాలి. ఆ సినిమా చూసిన వెంటనే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అలా అయితే మీరు డబ్బులు గెలుచుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

హాలీవుడ్ సినిమాలు(Hollywood Movies) ఎక్కువగా చూసేవారికి డబ్బులు గెలుచుకునేందుకు ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్(Fast and Furious) సినిమాలు చూసే ఉంటారు కదా. ఆ ఫ్రాంచైజీకి ప్రత్యేక స్థానం ఉంది. విన్ డీజిల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా తొమ్మిది భాగల్లో విడుదలైంది. అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. తొమ్మిది భాగాలు బ్లాక్ బస్టర్స్. మే 19న ఈ సిరీస్ లో 10వ సినిమాగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎక్స్(Fast and Furious X) విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా కోసం ఫైనాన్స్ బజ్ అనే ఓ ఇంటర్నేషనల్ వెబ్ సైట్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈ సినిమా విషయంలో వారికి సాయం చేస్తే.. వేయి డాలర్లు ఇస్తారట. అంటే.. సుమారు 82 వేల రూపాయలు. అయితే దీనికోసం ఓ పని చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్(Fast and Furious Series)కు సంబంధించి.. ఇప్పటి వరకూ వచ్చిన 10 భాగాలను చూడాలి. అందులో ఏ కారు డ్యామేజ్ అయిందో నోట్ చేసి వెబ్ సైట్ కు అందజేయాల్సి ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా కంపెనీకి ఎంత ఇన్సూరెన్స్ భారం పడుతుందనేది వెబ్ సైట్ వాళ్లు అంచనా వేస్తారు. ప్రతి చిత్రంలో సంభవించే ప్రతి కారు ప్రమాదం నుండి నష్టాన్ని ట్రాక్ చేయడం దీని వెనుక ఉన్న లక్ష్యం. పోటీలో పాల్గొన్నవారు కార్లను జాగ్రత్తగా గమనించాలి.

ఆ తర్వాత వాళ్ల వెబ్ సైట్లో మీ సమాచారాన్ని అప్ లోడ్ చేయాలి. అంచనాలకు ఎవరు దగ్గరగా ఉంటారో వారికి 1000 డాలర్ల నగదు బహుమతి అందిస్తారు. సినిమా టికెట్స్(Movie Tickets), స్నాక్స్ కోసం మరో వంద డాలర్లు కూడా ఇవ్వనున్నారు. అయితే ఈ ఆఫర్ కేవలం అమెరికాలో ఉన్నవారికే. 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే అర్హులు. సినిమా విడుదల తేదీ అంటే.. మే 19న రిజిస్టర్ చేసుకోవచ్చు. గెలిచిన వారి లిస్టును మే 26లోగా ప్రకటిస్తారు.

టాపిక్