The Vision of Brahmastra: బ్రహ్మాస్త్రాన్ని పరిచయం చేసిన జక్కన్న.. ప్రపంచంలో ప్రేమకు అంత శక్తి ఉందా?
The Vision of Brahmastra: రణ్‌బీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా థీమ్‌ను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. రాజమౌళి ఈ వీడియో ఈ సినిమా విజన్ గురించి వివరించారు.
The Vision of Brahmastra Presented by Rajamouli: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాను పాన్ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. అయ్యన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల కానుంది. టాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలకు ముందు విజన్ ఆఫ్ బ్రహ్మాస్త్ర(Vision of Brahmastra) పేరుతో ఈ సినిమా థీమ్‌ను పరిచయం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
బ్రహ్మాస్త్ర చిత్రంతో తనకున్న అనుబంధాన్ని రాజమౌళి గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా దర్శకుడు అయ్యన్.. ఈ చిత్ర కథను తొలిసారిగా 2016లో షేర్ చేసుకున్నారని, అప్పుడే ఈ స్టోరీ లైన్ తనకు బాగా నచ్చిందని జక్కన్న స్పష్టం చేశారు.
“ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాయింట్ హిందూ పురాణాల ఆధారంగా బ్రహ్మాస్త్ర కథను అయ్యన్ తయారు చేశారు. మన పురాణాలు, ఇతిహాసాల ఆధారం చేసుకుని అస్త్రావర్స్(Astraverse) రూపకల్పన చేశాడు. అస్త్రావర్స్ అంటే ఏంటంటే మన శాస్త్రాల ప్రకారం మనిషి మనుగడకు మూల కారణం పంచభూతాలు. అలాంటి పంచభూతాలను శాసించే శక్తి బ్రహ్మా శక్తి. బ్రహ్మాస్త్ర కథ.. అలాంటి బ్రహ్మశక్తి నుంచి పుట్టిన అస్త్రాల గురించి, వాటిని ప్రేరేపించే సూపర్ హీరోల గురించి ఉంటుంది. అలాంటి అస్త్రాలే వానరాస్త్ర, అగ్ని అస్త్ర, నంది అస్త్ర మొదలైనవి ఉంటాయి. ఈ అస్త్రాల ఉపయోగించే సూపర్ హీరోలు, వారి మధ్య సంఘర్షణలను విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి అయ్యన్ అద్భుతంగా తెరకెక్కించాడు. వీటన్నింటికంటే ఈ సృష్టిలో అద్భుతమైన శక్తి ఒకటి ఉంది. అదే ప్రేమ. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎలాంటి శక్తినైనా ఎదుర్కోగలదు అని ఈ విజవల్ వండర్‌లో చూపించారు." అని రాజమౌళి బ్రహ్మాస్త్ర థీమ్‌ను వీడియో రూపంలో పరిచయం చేశారు.
బ్రహ్మాస్త్ర విషయానికి వస్తే ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా చేశారు. రణ్‌బీర్-ఆలియా కలిసి నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. నాగార్జునతోపాటు అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ కూడా ఈ మూవీలో నటించారు. సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంబంధిత కథనం