Varasudu First Single: వారసుడు మొదటి పాటకు ముహూర్తం ఫిక్స్.. ప్రోమోపై ఓ లుక్కేయండి-thalapathy vijay varasudu first single ranjithame promo release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varasudu First Single: వారసుడు మొదటి పాటకు ముహూర్తం ఫిక్స్.. ప్రోమోపై ఓ లుక్కేయండి

Varasudu First Single: వారసుడు మొదటి పాటకు ముహూర్తం ఫిక్స్.. ప్రోమోపై ఓ లుక్కేయండి

Varasudu First Single: తళపతి విజయ్ నటించిన తాజా చిత్రం వారసుడు. తమిళంతో పాటు తెలుగులో డబ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటటి పాట రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. నవంబరు 5న తొలి పాట రానుంది.

వారసుడు ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది.

Varasudu First Single: కోలీవుడ్ స్టార్ విజయ్ ఈ ఏడాది బీస్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోనప్పటికీ ఈ చిత్రంలోని హబీబో సాంగ్ సూపర్ హిట్టయింది. అలాగే మ్యూజిక్‌కు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఆయన నటించనున్న మరో సినిమా వారిసు. తెలుగులో ఈ చిత్రం వారసుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం.

కేవలం తమిళ వెర్షన్‌ను మాత్రమే విడుదల చేసింది. రంజితమే అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. అంతేకాకుండా పాటకు తగినట్లుగా విజయ్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో రంజితమే సాంగ్ హైలెట్ కానుంది. ప్రస్తుతానికి ప్రోమో రిలీజ్ చేసిన చిత్రబృందం.. పూర్తి పాటను నవంబరు 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ సినిమాలో విజయ్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఖుష్బూ, ప్రకాశ్ రాజ్, ప్రభు, యోగి బాబు, శ్రీకాంత్, శరత్ కుమార్, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల చేయనుంది చిత్రబృందం.

సంబంధిత కథనం