Telugu News  /  Entertainment  /  Sharukh Khan Asks Ram Charan To Take Him To Pathaan Movie In Telugu States Theatre
షారుఖ్ ఖాన్, రామ్ చరణ్
షారుఖ్ ఖాన్, రామ్ చరణ్

SRK Asks Ram Charan : రామ్ చరణ్ నన్ను పఠాన్ మూవీకి తీసుకెళ్లండి.. షారుక్ రిక్వెస్ట్

22 January 2023, 5:52 ISTAnand Sai
22 January 2023, 5:52 IST

Sharukh Khan's Pathaan Movie : షారుఖ్ ఖాన్ కమ్ బ్యాక్ చిత్రం పఠాన్ జనవరి 25న థియేటర్లలోకి రానుంది. భారీ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అయితే బాలీవుడ్ బాద్ షా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఓ రిక్వెస్ట్ పెట్టాడు.

జనవరి 25న పఠాన్(Pathaan) ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. నాలుగేళ్ల తర్వాత వస్తున్న షారుఖ్ ను థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. అయితే తాజాగా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) తన ట్విట్టర్ ఖాతాలో #AskSRK సెషన్‌ను నిర్వహించాడు. దీనిలో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. తన అభిమానిలో ఒకరికి రిప్లై ఇస్తూ.. రామ్ చరణ్‌(Ram Charan)కు SRK ఓ రిక్వెస్ట్ పెట్టాడు షారుఖ్.

ట్రెండింగ్ వార్తలు

బాలీవుడ్ బాద్ షా అభిమాని ఒకరు హాయ్ సార్, సినిమా విడుదల తేదీలో తెలుగు రాష్ట్రాల్లోని ఏదైనా థియేటర్‌కి వస్తారా అని అడిగాడు. దానికి షారుక్ ఖాన్.. రామ్ చరణ్ నన్ను తీసుకెళ్లండి.. అని బదులిచ్చాడు. రామ్ చరణ్ వరకూ ఈ విషయం వెళ్లి ఏం రిప్లై ఇస్తాడో చూడాలి.

ఇదిలా ఉండగా పఠాన్‌కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌(Pathaan Advance Bookings)లు రోజురోజుకు రికార్డులను బద్దలు కొడుతున్నాయి. దీపికా పదుకొనే(Deepika Padukone), జాన్ అబ్రహం కూడా నటించిన ఈ చిత్రం, టిక్కెట్ అమ్మకాల నుండి ఇప్పటికే రూ.10 కోట్లకు పైగా వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్‌కు సిద్ధంగా ఉంది.

జనవరి 10న పఠాన్ ట్రైలర్‌(Pathaan Trailer) రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను షారుక్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై మెగాపవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ స్పందిస్తూ.. పఠాన్‌ టీమ్‌కు కంగ్రాట్స్‌ చెప్పాడు. దీనికి షారుక్‌ కూడా స్పందిస్తూ.. మీరు ఆస్కార్‌ను ఇంటికి తెచ్చినప్పుడు నన్ను దానిని టచ్‌ చేయనీయండి అంటూ రిప్లై ఇవ్వడం విశేషం.

SS రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్-యాక్షన్ బ్లాక్ బస్టర్ RRRలో Jr NTR తో రామ్ చరణ్ కనిపించాడు. ఈ చిత్రంలోని నాటు నాటు పాట(Natu Natu Song) ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్‌(Golden Globe)తో సహా అనేక అవార్డులను కైవసం చేసుకుంది. ఈ సినిమా ఆస్కార్ బరిలో కూడా ఉంది. పఠాన్ విడుదలకు ఒక రోజు ముందు జనవరి 24న ఆస్కార్ నామినేషన్స్ ప్రకటిస్తారు.