Telugu News  /  Entertainment  /  Shaakuntalam Release Postponed Again
శాకుంతలంలో సమంత
శాకుంతలంలో సమంత

Shaakuntalam Release Postponed: ప్చ్.. శాకుంతలం మళ్లీ వాయిదా.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పని మేకర్స్

07 February 2023, 14:38 ISTHari Prasad S
07 February 2023, 14:38 IST

Shaakuntalam Release Postponed: ప్చ్.. శాకుంతలం మళ్లీ వాయిదా పడింది. ఈసారి మూవీని మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తామో కూడా స్పష్టంగా చెప్పలేదు ఈ సినిమా మేకర్స్.

Shaakuntalam Release Postponed: సమంత శాకుంతలం చూసే అదృష్టం ఇప్పట్లో ప్రేక్షకులకు లేనట్లుగా కనిపిస్తోంది. ఈ మూవీ రిలీజ్ మళ్లీ మళ్లీ వాయిదా పడుతూనే ఉంది. నిజానికి గతేడాది రిలీజ్ కావాల్సిన సినిమా. అప్పట్లో డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ 3డీలోనూ తీసుకొస్తామంటూ ఈ ఏడాదికి వాయిదా వేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఫిబ్రవరి 17 రిలీజ్ చేయనున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. కానీ తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 7) ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కొత్త రిలీజ్ తేదీని త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పారు. గత కొన్ని రోజులుగా శాకుంతలం రిలీజ్ వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మేకర్స్ మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని భావించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఈ మైథలాజికల్ డ్రామా కోసం చాన్నాళ్లుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మూవీ నుంచి వచ్చిన ట్రైలర్, పాటలు అంచనాలను మరింత పెంచేశాయి. శకుంతల క్యారెక్టర్ లో సమంత ఎంతో అందంగా కనిపిస్తోంది. దీంతో మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులను మరోసారి నిరాశ పరిచారు.

ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడిగా కనిపించాడు. ఈ సినిమా రిలీజ్ వాయిదా విషయాన్ని వెల్లడిస్తూ.. "శాకుంతలం మూవీని ఫిబ్రవరి 17న రిలీజ్ చేయలేకపోతున్నామని చెప్పేందుకు చింతిస్తున్నాము. రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తాం. మాకు మద్దతుగా నిలిచిన అందరికీ థ్యాంక్యూ" అని మేకర్స్ చెప్పారు.

సమంత, దేవ్ మోహన్ తో పాటు శాకుంతలం మూవీలో ఉన్ని ముకుందం విలన్ పాత్రలో కనిపించనుండగా.. మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అనన్య నాగళ్ల, అల్లు అర్హ ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. గుణ శేఖర్ కూతురు నీలిమ గుణ.. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ కింద ఈ పాన్ ఇండియా మూవీని ప్రొడ్యూస్ చేసింది. 2డీ, 3డీల్లో రిలీజ్ కానుంది.

టాపిక్