Samantha training: గడ్డ కట్టించే చలిలో సమంత ట్రైనింగ్.. వైరల్ అవుతున్న వీడియో
Samantha training: గడ్డ కట్టించే చలిలో సమంత ట్రైనింగ్ తీసుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను సమంతనే సోమవారం (ఫిబ్రవరి 20) తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
Samantha training: సమంత రుత్ ప్రభు.. ఓవైపు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూనే మరోవైపు తన ఫిట్‌నెస్ పై దృష్టి సారిస్తోంది. తాజాగా సోమవారం (ఫిబ్రవరి 20) ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. నైనితాల్ లోని ఓ ఆశ్రమానికి వెళ్లి సామ్.. అక్కడ రాత్రి వేళ గడ్డ కట్టించే చలిలో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్న వీడియో ఇది.
నైనితాల్ లో ఎంత చలి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ రాత్రి వేళ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయి. తాజాగా సమంత 8 డిగ్రీల చలిలో ఈ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంది. తన టీమ్ తో కలిసి ఆమె ఈ వీడియోలో కనిపించింది. స్పోర్ట్స్ వేర్ లో కనిపించిన సామ్.. సీరియస్ గా ట్రైనింగ్ చేస్తూ ఉండటం అభిమానులను ఆకట్టుకుంది.
ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. "నా ఫేవరెట్ వ్యక్తి యానిక్ బెన్" అనే క్యాప్షన్ ఉంచింది. ఇక నైనితాల్ ను లొకేషన్ గా ట్యాగ్ చేస్తూ 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు తెలిపింది. నైనితాల్ కు సంబంధించిన మరో ఫొటోను కూడా ఆమె షేర్ చేసుకుంది. నీమ్ కిర్బోలి బాబా కైచీ ధామ్ అంటూ ఆ లొకేషన్ షేర్ చేసింది. నైనితాల్ లో ఇదొక ఆధ్యాత్మిక క్షేత్రం.
ప్రస్తుతం నైనితాల్ లో ఉన్న ఆమె.. గతవారం తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని కూడా సందర్శించింది. అప్పటి వీడియోలు కూడా కొన్ని వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఆలయానికి ఉన్న మొత్తం 600 మెట్లూ ఎక్కుతూ ప్రతి మెట్టుపై దీపాన్ని వెలిగిస్తూ వెళ్లింది సమంత. ప్రస్తుతం సామ్ మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.
వాయిదా పడుతూ వస్తున్న తన శాకుంతలం మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సమంత.. తన తర్వాతి మూవీ ఖుషీ షూటింగ్ లోనూ బిజీగా ఉంది. విజయ్ దేవరకొండతో కలిసి ఈ మూవీలో ఆమె నటిస్తోంది. ఇక వెబ్ సిరీస్ సిటడెల్ లోనూ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి సామ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
సంబంధిత కథనం
టాపిక్