RRR win International Award: ఆర్ఆర్ఆర్‌కు అంతర్జాతీయ పురస్కారం.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్‌గా నిలిచిన చిత్రం
RRR win International Award: రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రస్తుతం విదేశాల్లో విపరీతంగా ఆదరణ వస్తోంది.
RRR win International Award: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో విపరీతంగా అలరిస్తున్న ఈ సినిమా అప్పుడే అంతర్జాతీయ పురస్కారాలను గెలుచుకుంటూ దూసుకెళ్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసిన నటించిన ఈ సినిమా మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా సన్‌సెట్ సర్కిల్ అవార్డ్స్ 2022లో రెండు పురస్కారాలను గెలుచుకుంది.
ట్రెండింగ్ వార్తలు
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ 2022 పురస్కారంతో పాటు దర్శకుడు రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ల విభాగంలో రన్నరప్‌గా నిలిచారు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో ఆర్ఆర్ఆర్ నాలుగు సినిమాలతో పోటీ పడి చివరకు పురస్కారాన్ని దక్కించుకుంది. ఈ అవార్డు ఆర్ఆర్ఆర్‌కు వచ్చినట్లు సదరు సన్‌సెట్ సర్కిల్ జ్యూరీ ట్విటర్ వేదికగా తెలియజేసింది. దీంతో నెటిజన్లు కూడా ఆర్ఆర్ఆర్‌కు ఈ గౌరవం రావడంపై విశేషంగా స్పందిస్తున్నారు.
ఈ పురస్కారం ఆర్ఆర్ఆర్‌కు వచ్చిన మొదటి అంతర్జాతీయ పురస్కారంగా చెబుతున్నారు. తదుపరి టార్గెట్ ఆస్కారేనని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఆస్కార్ రేసులో నిలిచేందుకు పలు విభాగాల్లో నామినేషన్లను పంపింది ఆర్ఆర్ఆర్ బృందం. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారత్ తరఫున ఆర్ఆర్ఆర్‌ను కాకుండా ఛెల్లో షో చిత్రాన్ని పంపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం జపాన్ వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.
ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.
సంబంధిత కథనం
ED Questions Vijay Deverakonda: ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ
November 30 2022