Rashmika reaction on Negative Troll: నిశ్శబ్దాన్ని వీడిన రష్మిక.. నెగిటివిటీపై స్ట్రాంగ్ రిప్లయి ఇచ్చిన ముద్దుగుమ్మ-rashmika mandanna reaction on getting hate for not watching kantara ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rashmika Mandanna Reaction On Getting Hate For Not Watching Kantara

Rashmika reaction on Negative Troll: నిశ్శబ్దాన్ని వీడిన రష్మిక.. నెగిటివిటీపై స్ట్రాంగ్ రిప్లయి ఇచ్చిన ముద్దుగుమ్మ

Maragani Govardhan HT Telugu
Nov 09, 2022 09:22 AM IST

Rashmika reaction on Negative Troll: తనపై వస్తున్న నెగిటివ్ ట్రోల్‌పై నేషనల్ క్రష్ రష్మికా మందన్నా స్పందించింది. కాంతార సినిమా చూడకపోవడంతో ఆమెపై నెట్టింట విమర్శలు కురుస్తోంది. తాజాగా వీటిపై తన ఇన్‌స్టాగ్రామ్ నోట్ ద్వారా స్పందించింది.

రష్మిక మందన్నా
రష్మిక మందన్నా

Rashmika reaction on Negative Troll: చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా చిత్రంగా దుమ్మురేపుతోంది కన్నడ చిత్రం కాంతార. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమాను సామాన్యులే కాకుండా సెలబ్రెటీలు సైతం వీక్షించి తమ సానుకూల స్పందనను తెలియజేశారు. ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి తెరెకెక్కించిన కిరిక్ పార్టీ సినిమాతో చిత్రసీమలో అరంగేట్రం చేసిన రష్మికా మందన్నా.. ఇంత వరకు ఈ సినిమా చూడలేదని ఇటీవల తెలపడంతో ఆమెపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు ఆమె వాటిపై స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ నోట్‌ను షేర్ చేసింది.

""గత కొన్ని రోజులు లేదు వారాలు లేదు నెలలు లేదు కొన్ని సంవత్సరాలుగా కొన్ని విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. ఇది నేను సంవత్సరాల క్రితమే చేయాల్సిన పని. నా కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నా కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి చాలా ద్వేషానికి గురవుతున్నాను. నెగిటివ్ ట్రోల్స్ నాపై చేస్తున్నారు. నేను ఎంచుకున్న జీవితం ఎంతో విలువైందని నాకు తెలుసు. అలా అనీ అందరూ అంగీకరించేలా ఉండాలంటే నా వల్ల కాదు. ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించాలని నేను అనుకోను. అలా అని నాపై ప్రతికూలతను ప్రచారం చేయాలని దీనర్థమూ కాదు.

మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను చేయాల్సిన పని చేస్తున్నాను. అది నాకు తెలుసు. నా పని ద్వారా మీరు అనుభవంచే ఆనందమే నేను పట్టించుకుంటాను. మీరు గర్వపడేలా చేయడానికి నా శక్తి మేర నేను ప్రయత్నిస్తున్నాను. నేను చెప్పని విషయాలను కూడా ఇంటర్నెట్‌లో ఎగతాళిగా కామెంట్లు చేస్తున్నప్పుడు హృదయ విదారకంగా అనిపిస్తుంది. చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. నేను చెప్పిన విషయాలు కూడా కొన్ని నాకు వ్యతిరేకంగా మారుతున్నాయని గుర్తించాను. నాకు, పరిశ్రమలో లేదా బయట నా రిలేషన్‌షిప్స్‌ను ఇబ్బంది కలిగించే కొన్ని తప్పుడు కథనాలు ఇంటర్నెట్‌లో వ్యాప్తి చెందుతున్నాయి.

నిర్మాణాత్మక విమర్శలను(Constructive Criticisms) నేను ఎప్పుడూ స్వీకరిస్తాను. వాటి వల్ల నేను మెరుగ్గా పనిచేయగలుగుతాను. అయితే ప్రతికూలత, ద్వేషపూరిత విమర్శలు చేయడమేంటి? అలా చేయొద్దని చాలా కాలంగా చెబుతూనే ఉన్నాను. కానీ పరిస్థితి ఇంకా దిగజారింది. వీటిని పరిష్కరించడం ద్వారా నేను ఎవరినీ గెలవడానికి ప్రయత్నించడం లేదు. ఈ ద్వేషాన్ని బలవంతంగా మార్చాలని భావించడం లేదు.

మీ అందరి నుంచి పొందుతున్న ప్రేమను గుర్తించి అంగీకరిస్తున్నాను. మీ నిరంతర ప్రేమ, మద్దతు నన్ను ముందుకు నడిపించింది. బయటకు వచ్చి ఇలా చెప్పుకోడానికి నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపై నాకు ప్రేమ ఉంది. ఇప్పటి వరకు నేను పనిచేసిన వ్యక్తులు, నన్ను ఎప్పుడూ మెచ్చుకునే వారందరి కోసం కష్టపడి పనిచేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినట్లు మీమ్మల్ని సంతోషపెట్టడమే నాకు సంతోషాన్నిస్తుంది." అని రష్మిక మందన్నా తన ఇన్‌స్టాలో పేర్కొంది.

రష్మిక పోస్టుపై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చాలా మంది తమ స్పందనను తెలియజేస్తున్నారు. చాలా మంది అభిమానులు ఆమెకు అనుకూలంగా కామెంట్లు పెడుతున్నారు. మీరు మీలాగే ఉండంటి అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మికా మందన్నా పుష్ప-2 చిత్రంతో పాటు విజయ్ సరసన వారసుడు చిత్రంలోనూ నటిస్తోంది. ఇవి కాకుండా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్