Yodha OTT Streaming: ఓటీటీలోకి వ‌చ్చిన రాశీఖ‌న్నా బాలీవుడ్ యాక్ష‌న్ మూవీ - ఎందులో చూడాలంటే?-raashi khanna yodha movie streaming now on amazon prime video bollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yodha Ott Streaming: ఓటీటీలోకి వ‌చ్చిన రాశీఖ‌న్నా బాలీవుడ్ యాక్ష‌న్ మూవీ - ఎందులో చూడాలంటే?

Yodha OTT Streaming: ఓటీటీలోకి వ‌చ్చిన రాశీఖ‌న్నా బాలీవుడ్ యాక్ష‌న్ మూవీ - ఎందులో చూడాలంటే?

Nelki Naresh Kumar HT Telugu
Apr 26, 2024 08:49 AM IST

Yodha OTT Streaming: యోధ మూవీతో దాదాపు ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది రాశీఖ‌న్నా. ఈ యాక్ష‌న్ మూవీ శుక్ర‌వారం ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

యోధ ఓటీటీ స్ట్రీమింగ్
యోధ ఓటీటీ స్ట్రీమింగ్

Yodha OTT Streaming: రాశీ ఖ‌న్నా బాలీవుడ్ మూవీ యోధ ఓటీటీలోకి వ‌చ్చేసింది. థియేట‌ర్ల‌లో రిలీజైన న‌ల‌భై రోజుల త‌ర్వాత ఈ బాలీవుడ్‌ యాక్ష‌న్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంట‌ల్ విధానంలో యోధ మూవీ శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూడాలంటే స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో పాటు 349 రూపాయ‌లు అద‌నంగా డ‌బ్బులు చెల్లించాల్సివుంటుంది.

సిద్ధార్థ్ మల్హోత్రా హీరో...

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన యోధ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా న‌టించాడు. రాశీఖ‌న్నాతో పాటు దిశాప‌టానీ హీరోయిన్లుగా క‌నిపించారు. భారీ బ‌డ్జెట్‌తో క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. రొటీన్ కాన్సెప్ట్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో ఆడియెన్స్ థియేట‌ర్ల‌లో ఈ మూవీ ఫ్లాప్ చేశారు.

యోధ మూవీ క‌థ ఇదే...

దేశంలో టెర్ర‌రిస్ట్‌లు చేస్తోన్న కుట్ర‌ల‌ను అడ్డుకునేందుకు ప్ర‌భుత్వం యోధ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్‌లో సైనికుడిగా ప‌నిచేస్తుంటాడు అరుణ్ క‌థియాల్ (సిద్ధార్థ్ మల్హోత్రా). టెర్ర‌రిస్ట్‌లు ఓ ఫ్లైట్‌ను హైజాక్ చేస్తారు. అందులోని ప్ర‌యాణికుల‌ను బందీలుగా చేసుకుంటారు.

ఈ హైజాక్ నుంచి ప్యాసింజ‌ర్స్‌ను సేఫ్‌గా అరుణ్ ఎలా కాపాడాడు? ఈ పోరాటంలో అత‌డికి లైలా (దిశా ప‌టానీ) ఎలా సాయ‌ప‌డింది? అరుణ్ ప్రేమించి పెళ్లిచేసుకున్న ప్రియంవ‌ద (రాశీఖ‌న్నా) ఎవ‌రు? అనే అంశాల‌తో ద‌ర్శ‌క‌ద్వ‌యం సాగ‌ర్ ఆంబ్రే, పుష్క‌ర్ ఓజా యోధ మూవీని తెర‌కెక్కించారు. 2021లోనే యోధ మూవీని అనౌన్స్‌చేశారు. కానీ కొవిడ్‌తో పాటు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల షూటింగ్ ఆల‌స్య‌మైంది.

ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత రీఎంట్రీ...

యోధ మూవీతో దాదాపు ప‌ద‌కొండేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత బాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెరిసింది రాశీఖ‌న్నా. 2013లో జాన్ అబ్ర‌హం హీరోగా న‌టించిన బాలీవుడ్ మూవీ మ‌ద్రాస్ కేఫ్‌తో రాశీఖ‌న్నా యాక్టింగ్ జ‌ర్నీ మొద‌లైంది. ఊహ‌లు గుస‌గుస‌లాడేతో హిట్ట‌వ్వ‌డంతో రాశీఖ‌న్నాకు తెలుగులో వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి. త‌మిళంలో బిజీగా మార‌డంతో బాలీవుడ్‌కు దూర‌మైంది. ద‌శాబ్ద కాలం త‌ర్వాత యోధ‌తో మ‌ళ్లీ బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.

యోధ త‌ర్వాత బాలీవుడ్‌లో మ‌రో రెండు సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది రాశీఖ‌న్నా. ఈ సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. హిందీలో అజ‌య్ దేవ్‌గ‌ణ్ రుద్ర వెబ్‌సిరీస్‌లో నెగెటివ్ షేడ్ రోల్ చేసింది.

త‌మ‌న్నాతో అరాణ్మ‌ణై 4...

రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ అరాణ్మ‌ణై 4 మే 3న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 26న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వారం వాయిదాప‌డింది. ఈ హారర్ మూవీ బాక్ పేరుతో తెలుగులోకి డ‌బ్ అవుతోంది.అరాణ్మ‌ణై 4 కు సుందర్ సి దర్శకత్వం వహించాడు. ఈ హారర్ మూవీలో రాశీఖ‌న్నాతో పాటు త‌మ‌న్నా మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. తెలుగులో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌తో తెలుగు క‌దా మూవీ చేస్తోంది రాశీఖ‌న్నా. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీతో స్టైలిష్ట్ నీర‌జ కోన డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోంది.

IPL_Entry_Point